కరోనాను జయించిన 94ఏళ్ల వృద్ధుడు..!

  • Published By: srihari ,Published On : June 8, 2020 / 03:35 PM IST
కరోనాను జయించిన 94ఏళ్ల వృద్ధుడు..!

94ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ ను జయించాడు. కొవిడ్-19 బారినుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. నోయిడాలో ఆస్పత్రి నుంచి కరోనా బాధితులు 31 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడి ఫొటోను ఢిల్లీకి సమీపంలోని గౌతమ్ బుధ్ద నగర్‌ జిల్లా మేజిస్ట్రేట్ Suhas LY ట్వీట్ చేశారు. ‘ఈ వృద్ధుడికి కరోనా నెగటీవ్ వచ్చింది. వ్యాధి నుంచి కోలుకున్నాడు. ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి అయ్యాడు. నాలాంటి వాళ్లకు ఈ వృద్ధుడే ఎంతో స్పూర్తి. కష్టాల్లో కూడా నిలబడా పోరాడాలనే ప్రేరణ మాలో పొందేలా చేశారు. 

మీరు మరి కొన్నేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆశిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. జూన్ 8 నుంచి అన్ని కార్యకలాపాలు జరిగేలా తమ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. మరో ఇతర అనమతులు అవసరం లేదన్నారు. ముందు జాగ్రత్త చర్యలను పాటిస్తూ తమ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చునని చెప్పారు.

గౌతమ్ బుద్ధా నగర్ జిల్లాలో కొత్తగా 41 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 20 రంగాల్లో కొన్ని జిల్లాల గ్రామాల్లో 31 కేసులు నమోదు కాగా, ఇతరులు కూడా ఆస్పత్రులు డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ నోయిడాలో 413 కరోనా నుంచి కోలుకున్నారు. మరో 211 యాక్టివ్ కేసులు ఉండగా.. 8 మంది మృతిచెందారు.