Saloon Offer: వ్యాక్సిన్ తీసుకుంటే.. హెయిర్ కట్ 50% డిస్కౌంట్!

కొందరు వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్నా అందుబాటులో లేకపోతే.. మరికొందరికి వ్యాక్సిన్ ఉన్నా అపోహల కారణంగా దూరంగా ఉండడం మన దేశంలో చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది. పలు స్వచ్ఛంద సంస్థలు, వైద్య కార్యకర్తలు దీనిపై అవగాహనా పెంచుతున్నా కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇప్పటికీ అదే భయం కనిపిస్తుంది.

Saloon Offer: వ్యాక్సిన్ తీసుకుంటే.. హెయిర్ కట్ 50% డిస్కౌంట్!

A Salon In Madurai Offers A 50 Discount To Customers With Their Corona Vaccination Certificates

Updated On : June 20, 2021 / 3:18 PM IST

Saloon Offer: కొందరు వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్నా అందుబాటులో లేకపోతే.. మరికొందరికి వ్యాక్సిన్ ఉన్నా అపోహల కారణంగా దూరంగా ఉండడం మన దేశంలో చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది. పలు స్వచ్ఛంద సంస్థలు, వైద్య కార్యకర్తలు దీనిపై అవగాహనా పెంచుతున్నా కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇప్పటికీ అదే భయం కనిపిస్తుంది. ప్రజలలో కరోనా భయాన్ని పోగొట్టి అవగాహనా పెంచేందుకు ఓ సెలూన్ యజమాని వినూత్నమైన అఫర్ ఒకటి ప్రకటించాడు.

ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వారికి తన సెలూన్ లో యాభై శాతం రాయితీ ఇస్తామని ప్రకటించాడు. త‌మిళ‌నాడు రాష్ట్రం మ‌ధురైలోని ఓ హెయిర్ క‌టింగ్ సెలూన్ య‌జ‌మాని ఈ వినూత్న ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు. వ్యాక్సిన్ వేయించుకుని స‌ర్టిఫికెట్‌తో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల‌కు యాభై శాతం డిస్కౌంట్‌తో హెయిర్ క‌ట్ చేస్తాన‌ని ఆఫర్ ఇచ్చాడు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు తాను ఈ ఆఫ‌ర్ ఇచ్చాన‌ని, థ‌ర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే అంద‌రం త‌ప్పకుండా వ్యాక్సిన్‌లు వేయించుకోవాల‌ని సెలూన్ య‌జ‌మాని కార్తికేయ‌న్ పేర్కొన్నాడు.