Vikarabad: పంట పొలాల్లో వింత శకటం ప్రత్యక్షం.. వీడిన మిస్టరీ

వికారాబాద్ జిల్లా మార్పల్లి మండల పరిధిలోని మొగ్గలిగుండ్ల గ్రామంలోని పంట పొలాల్లో ఓ వింత యంత్రం ప్రత్యక్షం అయింది. ఆ యంత్రానికి చుట్టూ కెమెరాలు ఉండి పారాషూట్ మాదిరిగా ఉంది. అది చూసిన గ్రామస్తులు ఏమై ఉంటుందా అని భయాందోళన చెందుతున్నారు. అయితే, శాస్త్రవేత్తలు దీని మిస్టరీని ఛేదించారు.

Vikarabad: పంట పొలాల్లో వింత శకటం ప్రత్యక్షం.. వీడిన మిస్టరీ

Vikarabad

Vikarabad: వికారాబాద్ జిల్లా మార్పల్లి మండల పరిధిలోని మొగ్గలిగుండ్ల గ్రామంలోని పంట పొలాల్లో ఓ వింత యంత్రం ప్రత్యక్షం అయింది. ఆ యంత్రానికి చుట్టూ కెమెరాలు ఉండి పారాషూట్ మాదిరిగా ఉంది. అది చూసిన గ్రామస్తులు దాన్ని వింతగా చూస్తున్నారు. గుండ్రంగా, చాలా పెద్దగా ఉన్న వింత శకటం ఎక్కడి నుండి వచ్చిందో, ఏంటోనని గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం చేయాలో అర్థంకాని గ్రామస్తులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.

Strange Object Landed in Vikarabad : ఆకాశం నుంచి వికారాబాద్ పంటపొలాల్లో పడిన వింత వస్తువు .. భయాందోళనలో గ్రామస్తులు

గ్రామస్తుల సమాచారంతో మార్పల్లి తహసీల్దార్ , పోలీసులు ఘటన స్థలికి చేరుకొని అసలు ఆ వింతశకటం ఎక్కడి నుండి వచ్చింది? ఎలా వచ్చింది అనే విషయాలపై ఆరా తీశారు. ఈ విషయాన్ని సైంటిస్టులు వద్దకు తీసుకెళ్లారు.. వారు వింత పరికరం మిస్టరీని చేధించారు. ఆ పరికరం స్పెయిన్ దేశానికి చెందిందిగా ధృవీకరించారు. స్పెయిన్ టూరిజంలో జనాలను తరలించే పరికరంగా దీనిని గుర్తించారు. టాటా కన్సల్టెన్సీ వాళ్లు రూపొందించిన ప్రయోగం దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు.

80-Foot Object: బీచ్ వద్ద 80 అడుగుల గుర్తు తెలియని వస్తువు

అయితే, ఈ ప్రయోగాన్ని పూర్తిగా భారత ప్రభుత్వ సహకారంతో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేయిన్ దేశంలో టూరిజంలో భాగంగా జనాలను తరలించేందుకు ఉపయోగపడుతుంది. బెలూన్ సహాయంతో ప్రయోగించామని, దీనిని పూర్తిగా ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేయడంతో జనావాసాలు లేని వద్దనే దిగేలా చూశామని సైంటిస్టులు ప్రకటించారు. అప్పటి వరకు ఇది ఏం పరికరమో తెలియక భయాందోళన చెందిన స్థానికులు సైంటిస్టుల ప్రకటనతో ఊపిరిపీల్చుకున్నారు.