MLA Raja Singh: మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను.. దయచేసి ఇలా చేయకండి: పవన్ కల్యాణ్‌కు రాజాసింగ్ విజ్ఞప్తి
"గతంలో పార్టీలు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ఇతర మతస్థులను శ్రీశైలం పవిత్ర ప్రాంతంలో స్థిరపడేలా చేశాయి. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారందరినీ సున్నిపేట ప్రాంతానికి పంపండి" అని అన్నారు.

MLA Raja Singh: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ ఓ కీలక విజ్ఞప్తి చేశారు.
“గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులపై దాడి చేస్తే శ్రీశైలం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పవన్ ట్వీట్ చేశారు. చాలా మంచిదే..
ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ పైన మనోళ్లుగానీ, బయటివాళ్లుగానీ, రాజకీయ నేతలుగానీ ఇలాంటి తప్పులు చేస్తే యాక్షన్ ఉంటుందని మంచి సందేశం ఇచ్చారు.
ఇప్పుడు పవన్‌కి శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కాపాడే బాధ్యత కూడా ఉంటుంది. శ్రీశైలం జ్యోతిర్లింంగాన్ని దర్శనం చేసుకోవడానికి యావత్ భారతదేశం నుంచి భక్తులు వస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే..
గతంలో రాజకీయ పార్టీల నేతలు అక్కడ పాపాలు చేశారు. (MLA Raja Singh)
శ్రీశైలం చాలా పెద్ద పవిత్ర స్థలం, కానీ ఈ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయడానికి చాలా కాలంగా కుట్ర జరుగుతోంది.
గతంలో పార్టీలు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ఇతర మతస్థులను శ్రీశైలం పవిత్ర ప్రాంతంలో స్థిరపడేలా చేశాయి.
అన్యమతస్థుల విషయం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి తెలుసా? లేదా? తెలిస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను.
దయచేసి మీరు కూడా అదే తప్పు చేయకండి. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారందరినీ సున్నిపేట ప్రాంతానికి పంపండి” అని అన్నారు.