Asia Cup 2025 : టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత్, పాక్ పోరు.. ఇక రచ్చరచ్చే..
Asia Cup 2025 : పాకిస్థాన్‌తో అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన నూతన క్రీడా విధానాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది.

Asia Cup 2025
Asia Cup 2025 : టీమిండియా ఫ్యాన్స్‌కు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఆసియా కప్ 2025 టీ20 టోర్నీ ఫ్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ సారథ్యంలో టీమిండియా ఆసియా కప్ (Asia Cup 2025) లో ప్రత్యర్థి జట్లతో తలపడనుంది. ఈ టోర్నీలో సెప్టెంబర్ 10న భారత్ వర్సెస్ యూఏఈ మధ్య మ్యాచ్ జరగనుంది. 14వ తేదీన పాకిస్థాన్ తో భారత్ తలపడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్ జరిగే విషయంపై సందిగ్దత నెలకొంది. ఆ సందిగ్దతను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: Rohit Sharma : ఆస్ట్రేలియా టూర్‌కు ముందు రోహిత్ శర్మ కీలక నిర్ణయం..!
ఒకవేళ అదే జరిగితే.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే..
ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ , పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 14వ తేదీన దుబాయ్‌లో జరిగే మ్యాచ్ నిర్వహణపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. పాకిస్థాన్ జట్టుతో తలపడేందుకు కేంద్ర ప్రభుత్వం భారత జట్టుకు అనుమతి ఇచ్చింది. ఇతర దేశాలు కూడా పాల్గొంటున్న మల్టీలేటరల్ ఈవెంట్ కావడంతో ఈ మ్యాచ్‌లో ఆడటంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం లేదని ప్రకటించింది. ఈ క్రమంలో టోర్నీ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే భారత్‌లోని క్రికెట్ ఫ్యాన్స్ కు పండుగే అవుతుంది.
అనుమతికి కారణం ఇదే..
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.. కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన క్రీడా విధానం ప్రకాంర తటస్థ వేదికలపై కూడా పాకిస్థాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆబోదని వెల్లడించింది. కేవలం ఆసియా కప్‌లో భారత్ పాల్గొనేందుకు వెలుసుబాటు కల్పించింది. ఎందుకంటే.. బహుళ జట్లు పాల్గొంటున్న టోర్నీ కాబట్టి ఆసియా కప్ టోర్నీలో భారత్ పాల్గొనకుండా ఆపబోమని తెలిపింది.
Also Read: Ajinkya Rahane : అజింక్యా రహానే కీలక నిర్ణయం.. ఇక చాలు.. దిగిపోతున్నా..
మార్గదర్శకాలతో స్పష్టత…
పాకిస్థాన్‌తో అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన నూతన క్రీడా విధానాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. ఈ విధానం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే, ఈ నూతన విధానం ద్వారా బహుళ దేశాల టోర్నీ కోసం పాకిస్థాన్‌లో భారత్ పర్యటించాల్సి వచ్చినప్పుడు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. భారత్ పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు ఉండవని, ద్వైపాక్షిక సిరీస్‌లను అమెరికాలో నిర్వహించాలనుకున్నా భారత్ ఆడదని కేంద్రం తేల్చి చెప్పింది. పాకిస్థాన్‌లో జరిగే టోర్నీల్లో భారత జట్టు పాల్గొనదు.. అదేసమయంలో పాకిస్థాన్ జట్లకు భారత్‌లో పర్యటించేందుకు కూడా అనుమతి ఉండదు. బహుళ జట్ల టోర్నీ కాబట్టి ఆసియా కప్‌లో పాల్గొనకుండా భారత జట్టును అడ్డుకోం. అలాంటి టోర్నీలకు పాక్ ఆతిథ్యమిస్తే తప్ప భారత జట్టును నిలువరించమని క్రీడా శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
🚨 NO BILATERAL SERIES WITH PAKISTAN ❌
Sports Ministry confirms India not to participate in Pakistan nor will we permit Pakistan teams to play in India in Bilaterals. [Abhishek Tripathi]
Only allowed for Multilateral events likes of ICC or International tournaments. pic.twitter.com/P7hqgslWyh
— Johns. (@CricCrazyJohns) August 21, 2025