AAP-Uttarakhand: ఆప్ సీఎం అభ్యర్థి.. పార్టీకి రాజీనామా

ఉత్తరాఖండ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా ఉన్న అజయ్ కొతియాల్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పంపారు.

AAP-Uttarakhand: ఆప్ సీఎం అభ్యర్థి.. పార్టీకి రాజీనామా

Aap Uttarakhand

AAP-Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా ఉన్న అజయ్ కొతియాల్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పంపారు. గత ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అక్కడ ఘోరంగా ఓడిపోయింది.

TRS Rajyasabha: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

70 అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో గత ఏప్రిల్‌లో రాష్ట్రంలో పార్టీ కార్యవర్గాన్ని మొత్తం రద్దు చేసి, కొత్తగా దీపక్ బాలిని అధ్యక్షుడిని చేశారు. జిల్లాల అధ్యక్షుల్ని కూడా మార్చారు. దీంతో కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న అజయ్ కొతియాల్ తాజాగా రాజీనామా చేశారు. ఆయన గత ఏడాది ఏప్రిల్‌లో, కేజ్రీవాల్ సమక్షంలో పార్టీలో చేరారు. అజయ్ కొతియాల్ రిటైర్డ్ కల్నల్. ఆయన ఆర్మీలో వివిధ విభాగాల్లో సేవలందించారు. కీర్తి చక్ర, శౌర్య చక్ర, విశిష్ట్ సేవ వంటి పలు అవార్డులు అందుకున్నారు.

BJP National Meet: రేపటి నుంచి బీజేపీ జాతీయ సదస్సు.. వర్చువల్‌గా హాజరుకానున్న మోదీ

ఒక సంస్థ స్థాపించి, యువత ఆర్మీలో చేరేందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో ఉత్తర్ కాశి స్థానం నుంచి ఆప్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన అజయ్, సురేష్ చౌహాన్ చేతిలో ఓడిపోయారు. తాను ఆర్మీలో పని చేసిన సైనికుడిగా.. మాజీ సైనికులు, పారా మిలిటరీ సిబ్బంది, సీనియర్ సిటిజన్స్, మేధావులు, యువత, మహిళల సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని రాజీనామా చేస్తున్నట్లు అజయ్ పేర్కొన్నారు.