Kartikeya Wedding : ‘పెద్దయ్యాక హీరో అవుతా.. అప్పుడు నా పెళ్లికి చిరంజీవి వస్తాడు’

మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లికి అటెండ్ అయ్యి బ్లెస్ చెయ్యడం గురించి ఎమోషనల్ ట్వీట్ చేసాడు కార్తికేయ..

Kartikeya Wedding : ‘పెద్దయ్యాక హీరో అవుతా.. అప్పుడు నా పెళ్లికి చిరంజీవి వస్తాడు’

Actor Kartikeya

Updated On : November 23, 2021 / 8:42 PM IST

Kartikeya Wedding: టాలీవుడ్ యంగ్ హీరో, ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ రీసెంట్‌గా చిన్ననాటి స్నేహితురాలు లోహితను పెళ్లాడాడు. నవంబర్ 21 ఆదివారం ఉదయం జరిగిన కార్తికేయ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Kartikeya Wedding : లోహితను పెళ్లాడిన కార్తికేయ..

కార్తికేయ ఓ ఇంటివాడవడంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే కార్తికేయ పెళ్లి గురించిన వార్తలు, వెడ్డింగ్ పిక్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా కార్తికేయ చేసిన ఎమోషనల్ ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లికి అటెండ్ అయ్యి బ్లెస్ చెయ్యడం గురించి ట్వీట్ చేసాడు కార్తికేయ. ‘నేను పెద్దయ్యాక హీరో అవుతాను.. అప్పుడు నా పెళ్లికి చిరంజీవి కూడా వస్తాడు.. ఈ మాట నా చిన్నప్పుడు చెప్పాను. నా ఫేట్‌కి థ్యాంక్స్.. నేను యాక్టర్ అయ్యాను.. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు నా పెళ్లికి వచ్చి మమ్మల్ని ఆశీర్వందించారు.. మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా ముఖ్యం సార్’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసాడు కార్తికేయ.