The Kerala Story : ఫస్ట్ డే కలెక్షన్స్‌లో ‘ది కేరళ స్టోరీ’ కాశ్మీర్ ఫైల్స్‌కి డబుల్.. అదా శర్మ పెద్ద హిట్టే కొట్టిందిగా!

అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ ని అందుకుంటుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కాశ్మీర్ ఫైల్స్ ఫస్ట్ డే..

The Kerala Story : ఫస్ట్ డే కలెక్షన్స్‌లో ‘ది కేరళ స్టోరీ’ కాశ్మీర్ ఫైల్స్‌కి డబుల్.. అదా శర్మ పెద్ద హిట్టే కొట్టిందిగా!

Adah Sharma The Kerala Story cross frist day collections of Kashmir Files - Pic Source Twitter

Updated On : May 7, 2023 / 3:51 PM IST

The Kerala Story : హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయిన హీరోయిన్ అదా శర్మ (Adah Sharma). ప్రస్తుతం సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న ఈ భామ ‘ది కేరళ స్టోరీ’ రూపంలో భారీ విజయమే దక్కింది. గత కొంత కాలంగా కేరళలో (Kerala) అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కథనే సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు సుదీప్తో సేన్. ఇక ఈ చిత్రంలో అదా శర్మ, సిద్ది ఇదాని(Siddhi Idnani), యోగితా తదితరులు ప్రధాన పత్రాలు పోషించారు.

The Kerala Story: కాంట్రవర్సీ మూవీకి ట్యాక్స్ ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

ఈ సినిమా టీజర్ విడుదలైన దగ్గర నుంచి మూవీ పలువురు విమర్శలు చేస్తూ చిత్రాన్ని వివాదాల్లో నిలిపారు. రిలీజ్ విషయంలో కూడా ఎన్నో సమస్యలు ఎదురుకుంది. సినిమాని అడ్డుకోవ‌డానికి కొంతమంది ప్రయత్నాలు కూడా చేశారు. దీంతో చిత్ర యూనిట్ హైకోర్టుకు వెళ్లి సినిమా ఆపకుండా కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఇక మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ అయినా ఈ చిత్రం అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంది. మొదటిరోజే 8.03 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా మాదిరే ఒక యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కి వివాదాలు మధ్య రిలీజ్ అయిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files).

The Kerala Story : పొలిటికల్ హీట్ పెంచుతున్న ‘ది కేరళ స్టోరీ’

ఈ సినిమా మొదటిరోజు 4 కోట్లు కలెక్షన్స్ మాత్రమే అందుకుంది. ఇక కాశ్మీర్ ఫైల్స్ కి డబుల్ రేంజ్ లో కేరళ స్టోరీ కలెక్షన్స్ అందుకోవడంతో మూవీ టీం ఫుల్ జోష్ లో ఉన్నారు. కాశ్మీర్ ఫైల్స్ కేవలం మౌత్ టాక్ తో ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు కేరళ స్టోరీ కూడా అదే రీతిలో భారీ విజయాన్ని నమోదు చేసేలా కనిపిస్తుంది.