WBBL Game : వాట్ ఏ క్యాచ్..అమ్మాయి పట్టిన క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా

బిగ్ బాష్ వుమెన్స్ లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. సిడ్నీ థండర్స్ తో అడిలైడ్ జట్టు ఢీకొంది. గాల్లోనే క్యాచ్ పట్టింది. కానీ..ప్యాటర్సన్ బ్యాలెన్స్ కోల్పోయింది.

WBBL Game : వాట్ ఏ క్యాచ్..అమ్మాయి పట్టిన క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా

Cricket

Updated On : October 17, 2021 / 3:44 PM IST

Adelaide Strikers Bridget Patterson : క్రికెట్ లో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ఆటగాళ్ల అదిరిపోయే ఫీట్లు చేస్తుంటారు. క్యాచ్ లు పట్టేటప్పుడు వారు చేసే విన్యాసాలకు ఫిదా అవుతుంటారు. తాజాగా…ఓ అమ్మాయి క్యాచ్ పట్టిన తీరు అద్భుతం అంటున్నారు. బౌండరీ లైన్ వద్ద ఒంటి చేత్తో పట్టిన క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వాట్ ఏ క్యాచ్ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు.

Read More : Asia Cup 2023 : పాక్‌లో పర్యటించనున్న టీమిండియా..ఎప్పుడంటే!

బిగ్ బాష్ వుమెన్స్ లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. సిడ్నీ థండర్స్ తో అడిలైడ్ జట్టు ఢీకొంది. సిడ్నీ థండర్స్ జట్టుకు చెందిన ఇసబెల్ల బ్యాటింగ్ చేస్తున్నారు. ఓ బాల్ ను సిక్స్ గా మలిచేందుకు ట్రై చేసింది. భారీ షాట్ కొట్టడంతో..బంతి..బౌండరీ దాటి అవతలపడుతుందని అనుకున్నారు. అక్కడ అడిలైడ్ స్ట్రయికర్స్ క్రీడాకారిణి బ్రిడ్జెట్ పాటర్సన్ ఫీల్డింగ్ చేస్తున్నారు. అవతల పడుతున్న బంతిని అమాంతం అడ్డుకొనే ప్రయత్నించింది. గాల్లోనే క్యాచ్ పట్టింది. కానీ..ప్యాటర్సన్ బ్యాలెన్స్ కోల్పోయింది.

Read More : IPL 2021 : నడి సముద్రంలో క్రికెట్ ఆడుతూ..ధోనికి శుభాకాంక్షలు

బంతిని గాల్లోకి నెట్టి…వెనక్కు అడుగు వేసింది. క్షణాల్లో బల్లి బౌండరీ లైన్ లోపలికి వచ్చి..క్యాచ్ పట్టింది. దీంతో ఇసబెల్ల (6) వెనక్కి మళ్లింది. అద్భుతంగా క్యాచ్ పట్టిన ప్యాటర్సన్ ను సహచర ఆటగాళ్లు అభినందించారు. నెటిజన్లు కూడా ప్రశంసించారు. మ్యాచ్ విషయానికి వస్తే…తొలుత అడిలైడ్ స్ట్రయికర్స్ బ్యాటింగ్ చిసంది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి..140 పరుగులు చేయగా…141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ 110 పరుగులు మాత్రమే చేసింది.