Adipurush: ఆదిపురుష్ విజువల్ ట్రీట్.. ఎనిమిదివేల VFX షాట్స్!

భారత చలచిత్ర పరిశ్రమలో ఇప్పుడు మోస్ట్ వెయిటెడ్ సినిమాల జాబితాలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం దక్షణాది నుండి ఉత్తరాది వరకు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Adipurush: ఆదిపురుష్ విజువల్ ట్రీట్.. ఎనిమిదివేల VFX షాట్స్!

Adipurush Visual Treat Eight Thousand Vfx Shots

Adipurush: భారత చలచిత్ర పరిశ్రమలో ఇప్పుడు మోస్ట్ వెయిటెడ్ సినిమాల జాబితాలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం దక్షణాది నుండి ఉత్తరాది వరకు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ను మరో మెట్టు ఎక్కించేలా ఈ సినిమాను తెరకెక్కించాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికి కొంత మేర షూటింగ్ కంప్లీట్ చేసుకోగా కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ చిత్రం తిరిగి మళ్ళీ షూట్ రీస్టార్ట్ కి రెడీగా ఉంది. ప్రభాస్ జోడిగా సీత పాత్రలో కృతిసనన్ నటిస్తుండగా అన్ని బాషలను చుట్టేలా భారీ తారాగణాన్ని కూడా తీసుకున్నారు.

అయితే.. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కీలకం కానున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే కాగా.. ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం ఇండియన్ సినిమా చరిత్రలో ఆదిపురుష్ అత్యధికంగా విజువల్ ఎఫెక్ట్ వినియోగించిన సినిమా కానుందని చెప్తున్నారు. ఏకంగా ఎనిమిది వేలకు పైగా విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ తో ఈ సినిమా తెరకెక్కనుందని చెప్తున్నారు.

భారత సినీ చరిత్రలో తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చిన బాహుబలిలో రెండో భాగానికి 2500 విజువల్ ఎఫెక్ట్ షాట్స్ వినియోగించగా.. రోబో సీక్వెల్ 2.0కి అధికంగా 3000కి పైగా విజువల్ ఎఫెక్ట్ షాట్స్ వినియోగించినట్లు మేకర్స్ చెప్పుకున్నారు. అలాంటిది ఆదిపురుష్ కి ఏకంగా 8000 షాట్స్ వినియోగిస్తున్నారంటే ఆదిపురుష్ ఇండియన్ సినిమా దగ్గర ఏ రేంజ్ విజువల్ ట్రీట్ ను ఇవ్వనుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇదే సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.