Ajwain Jeera Tea : ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ, గుండె ప‌నితీరు మెరుగుపరిచే వాము, జీలకర్ర టీ!

బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి వాము, జీలకర్రతో కలిపి చేసిన టీ ఎంతగానే తోడ్పడుతుంది. ఈ టీని మూడు నెల‌ల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ, గుండె ప‌నితీరు మెరుగ‌వుతుంది. కంటి చూపు మెరుగ‌వుతుంది. ప‌ళ్లు, చిగుళ్లు బ‌లంగా ఆరోగ్యంగా త‌యార‌వుతాయి.

Ajwain Jeera Tea : ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ, గుండె ప‌నితీరు మెరుగుపరిచే వాము, జీలకర్ర టీ!

Ajwain Jeera Tea

Ajwain Jeera Tea : మన వంటింట్లో వాముకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి ఘాటైన రుచి, వాసన ఉంటుంది. పలు జీర్ణ, శ్వాస సమస్యలకు, నొప్పులకు వాము ఒక చక్కని ఔషధం. వాము ఎక్కువగా వాడేవారిలో రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగవడం తో పాటు శరీరంలోనిల్వ ఉన్న కొవ్వు తగ్గి బరువు అదుపులోకి వస్తుంది. విట‌మిన్ ఎ, సి, ఇ, కెల‌తోపాటు కాల్షియం, పొటాషియం, ఐర‌న్‌, పాస్ఫ‌ర‌స్ త‌దిత‌ర పోష‌కాలు కూడా వాములో ఉంటాయి.

ఇక జీలకర్ర విషయానికి వస్తే సుగంధ ద్రవ్యాలలో జీలకర్రకు ప్రత్యేక స్ధానం వుంది. జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వ్యాధినిరోధకతను పెంచుతుంది. దీనిలో వుండే పీచు పదార్ధం మలబద్ధకాన్ని పోగొడుతుంది. జీలకర్రను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మన శరీరంలో హీమో గ్లోబిన్  పెంచుకోవటానికి రెగ్యులర్ డైట్ లో జీకర్రను చేర్చుకోవచ్చు. జీలకర్ర ఎసిడిటిని తగ్గిస్తుంది.

అయితే వాము , జీలకర్ర కలిపి తయారు చేసిన టీ తో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి వాము, జీలకర్రతో కలిపి చేసిన టీ ఎంతగానే తోడ్పడుతుంది. ఈ టీని మూడు నెల‌ల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ, గుండె ప‌నితీరు మెరుగ‌వుతుంది. కంటి చూపు మెరుగ‌వుతుంది. ప‌ళ్లు, చిగుళ్లు బ‌లంగా ఆరోగ్యంగా త‌యార‌వుతాయి. ఈ టీ సేవించటం వల్ల శ‌రీరంలో పేరుకుపోయిన విష‌ప‌దార్థాలు మ‌ల‌, మూత్ర‌, చెమ‌ట ద్వారా బ‌య‌ట‌కొచ్చేస్తాయి. ఎముక‌లు బ‌లంగా తయార‌వుతాయి. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. దీర్ఘ‌కాలికంగా ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న వారికి ఇది చ‌క్క‌టి ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. రక్తంలో అదనపు కొవ్వు క‌రిగిపోతుంది. ర‌క్తం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది. శ‌రీరంపై ఉన్న ముడ‌త‌లు పోయి య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. వినికిడి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

వాము, జీలకర్ర టీ తయారీ ; ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర వేసి రెండు గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌ర్వాత ఆ నీటిని ఐదు నిమిషాల పాటు మ‌రిగించాలి. వేడి చేసిన నీటిని వ‌డ‌క‌ట్టి నాలుగు చుక్క‌లు నిమ్మ‌ర‌సం వేసుకోవాలి. రుచి కోసం అల్లం లేదా పుదీనా ఆకులు వేసుకోవచ్చు. ఒక టీస్పూన్ తేనె కూడా క‌లుపుకుని వేడి వేడిగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.