gift 300 kg lock : అయోధ్య రామ మందిరానికి 300 కిలోల తాళం బహుమానం

gift 300 kg lock : అయోధ్య రామ మందిరానికి 300 కిలోల తాళం బహుమానం

Aligarh Old Couple Gift 300 Kg Lock For The Ayodhya Ram Temple

old couple gift 300 kg lock for ram temple : అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎంతోమంది కల. మందిర నిర్మాణం పూర్తి అయితే చూడాలని కలలు కనే భక్తులు ఎంతోమంది వేచి చూస్తున్నారు. ఈక్రమంలో మందిర నిర్మాణంలో ఎంతో మంది పాలుపంచుకుంటున్నారు. వెండి, బంగారం, నగదు, ఇత్తడి ఇలా ఎన్నో రకాలుగా విరాళాలు అందజేస్తుతన్నారు. ఈక్రమంలో అలీగఢ్ జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు రామాలయానికి ఒక భారీ తాళాన్ని అందజేయనున్నారు. తాము ఇచ్చే విరాళం కోసం సత్య ప్రకాశ్ శర్మ,రుక్మిణి శర్మ దంపతులు ఏకంగా 300 కిలోల బరువున్న తాళాన్ని తయారు చేయిస్తున్నారు.

Lock

ఈ సందర్భంగా సత్యప్రకాశ్ శర్మ మాట్లాడుతూ తమ వంశం 100 ఏళ్లకు పైగా తాళాలను తయారు చేస్తోందనీ..ఇప్పుడు రామ మందిరం కోసం 300 కిలోల బరువున్న ప్రత్యేకమైన తాళాన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. సంవత్సం నుంచి ఈ భారీ తాళాన్ని తయారు చేస్తున్నామని, ఈ తాళం పూర్తయ్యేందుకు ఇంకా రెండు,మూడు నెలలు పడుతుందని తెలిపారు. ఈ తాళం తయారు చేసేందుకు లక్ష రూపాయల వరకూ ఖర్చవుతున్నదని తెలిపారు.

1

ప్రకాశ్‌ శర్మ, రుక్మిణి శర్మ దంపతులకు తాళాలు చేయడంలో విశేష అనుభవం ఉంది. 40 ఏళ్లుగా వారు ఆ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. తాళాలతోపాటు ఇతర వస్తువులు.. ఇనుము, వెండి, రాగి, ఇత్తడితో మన్నికైన వస్తువులు తయారు చేయడంలో వీరు దిట్ట. వీరు చేసే వస్తువులకు మంచి పేరుంది. లాక్‌డౌన్‌ కాలంలో పనిలేక సతమతమవుతున్న తమకు ఆ శ్రీరాముడు ఈ గొప్ప పని కల్పించాడని ప్రకాశ్‌ శర్మ ఆనందం వ్యక్తంచేస్తు తెలిపారు.

3

300 కిలోలున్న ఈ భారీ తాళం తయారీకి ఇనుము, రాగి, ఇత్తడి మిశ్రమాన్ని వినియోగించామని ప్రకాశ్‌ శర్మ తెలిపారు. ఈ గంట తయారీకి సంవత్సరం నుంచి రోజుకు 8 గంటలు శ్రమించి ఈ భారీ తాళం తయారుచేశామని తెలిపారు. తాళం చెవి బరువు దాదాపు 20 కిలోలు ఉంటుందన్నారు. ఈ మొత్తం తయారీ కోసం రూ.లక్ష వరకు ఖర్చు అయ్యిందని తెలిపారు. రామాలయం కోసం తాళం తయారుచేయడం సంతోషంగా ఉందని ఆ వృద్ధ దంపతులు సత్య ప్రకాశ్ శర్మ,రుక్మిణి శర్మలు తెలిపారు.