Allu Arjun Tattoo : ‘ఆవేశాన్ని ఆపగలం కానీ, అభిమానాన్ని ఆపలేం’.. నుదుటి మీద అల్లు అర్జున్ పర్మినెంట్ టాటూ..
ఏకంగా తన నుదిటి మీద అల్లు అర్జున్ పేరుని టాటూగా వేయించుకున్నాడు.. అది కూడా పర్మినెంట్ టాటూ కావడం విశేషం..

Allu Arjun Tattoo
Allu Arjun Tattoo: స్టార్స్ తెరమీద చూపించే హీరోయిజానికి తెరవెనుక ఎలాంటి అభిమానులు, వీరాభిమానులు, భక్తులు ఉంటారో ఇప్పటి వరకు చాలా సంఘటనలు చూశాం. ఇటీవల వందల కిలోమీటర్ల కొద్ది పాదయాత్రలు చేసి, సైకిల్ జర్నీ చేసి తమ అభిమాన నటులను కలుసుకుంటున్నారు ఫ్యాన్స్.
Pushpa : ‘పుష్ప’ కోసం ఓవరాల్ ఇండియా వెయిట్ చేస్తోంది..!
రీసెంట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాన్ ఒకరు వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీంతో నెట్టింట అతని పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఏకంగా తన నుదిటి మీద అల్లు అర్జున్ పేరుని టాటూగా వేయించుకున్నాడు. అది కూడా పర్మినెంట్ టాటూ కావడం విశేషం.
దీంతో ‘ఆవేశాన్ని ఆపగలం కానీ, అభిమానాన్ని ఆపలేం’ అంటూ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మీమ్స్‌తో సోషల్ మీడియాలో ఈ పిక్స్ షేర్ చేస్తూ తమకు బన్నీ అంటే ఎంత ఇష్టమో తెలియజేస్తున్నారు. బన్నీకి తెలుగు రాష్ట్రాలతో పాటు మలయాళంలోనూ అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ మన అల్లు అర్జున్‌ని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. కొద్ది కాలంగా బన్నీ సినిమాలు తెలుగుతో పాటు మలయాళంలోనూ ఒకేసారి విడుదలై రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.
View this post on Instagram