Amala Paul: తన మాజీ ప్రియుడు లైంగిక వేధింపులు చేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిన అమలా పాల్

అయితే తన మాజీ స్నేహితుడు భవీందర్ సింగ్ దత్‌.. తనని వేధిస్తున్నట్లు తమిళనాడులోని విల్లుపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అమలా పాల్ 2018లో భవీందర్ సింగ్ దత్‌తో కలిసి ఒక చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆ తరువాత......

Amala Paul: తన మాజీ ప్రియుడు లైంగిక వేధింపులు చేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిన అమలా పాల్

Amala Paul files a Complaint on her Ex-Boy friend..

Amala Paul : ప్రముఖ హీరోయిన్ అమలాపాల్.. తనని లైంగిక వేధింపులు చేస్తున్నారు అంటూ పోలీసులను ఆశ్రయించింది. తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన ఆమె ప్రస్తుతం అడపాదడపానే చిత్రాలు చేస్తోంది. అలానే ఒక సొంత నిర్మాణ సంస్థని ప్రారంభించి చిత్రాలు కూడా నిర్మిస్తోంది. ఆమె నిర్మించి, నటించిన కడవర్‌ ఇటీవల విడుదలై మంచి విజయాన్నే అందుకుంది.

Amala Paul : ఆ సినిమా కోసం మార్చురీలోకి వెళ్ళా.. పోస్ట్‌మార్టం చేయడం డైరెక్ట్ గా చూసి షాక్ అయ్యా..

అయితే తన మాజీ స్నేహితుడు భవీందర్ సింగ్ దత్‌.. తనని వేధిస్తున్నట్లు తమిళనాడులోని విలుప్పురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అమలా పాల్ 2018లో భవీందర్ సింగ్ దత్‌తో కలిసి ఒక చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఆ తరువాత ఆ ప్రొడక్షన్ కంపెనీని ఆరోవిల్లే సమీపంలోని పెరియముదలియార్ చావడికి మార్చారు. ఆ సమయంలోనే అమలా పాల్‌కు, భవీందర్ తో పరిచయం ఏర్పడి సాన్నిహిత్యం పెరగడంతో కొంతకాలానికి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కొంతకాలం తరువాత నిర్మాణ సంస్థ లావాదేవీల వల్ల ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో భవీందర్ సింగ్ కు అమలాపాల్‌ దూరంగా ఉంటుంది.

AmalaPaul : ఆ సమయంలో సినిమాలు మానేద్దామనుకున్నా.. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది

గత కొంతకాలంగా భవీందర్ సింగ్ అతనికి అడిగినప్పుడు డబ్బు ఇవ్వాలి అంటూ, తన మాట వినకపోతే ఆమె ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరిస్తునట్లు అమలా పాల్ పేర్కొన్నారు. అలాగే ఆమె నిర్మాణ సంస్థ డైరెక్టర్ పదవి నుంచీ అమలా పాల్‌ పేరుని తొలగించారు అని పోలీసులకు తెలిపింది. భవీందర్ సింగ్‌ తో పాటు అతని 11 మంది మిత్రులుపై ఫోర్జరీ, చీటింగ్, బెదిరింపు, వేధింపులతో పాటు పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ కేసు మేరకు పోలీసులు భవీందర్ సింగ్ ను అరెస్ట్ చేయగా, అతని 11 మంది మిత్రులు పరారీలో ఉన్నట్లు.. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు మీడియాకి తెలిపారు.