సిల్క్ స్మిత బయోపిక్.. అనసూయ క్లారిటీ..

  • Published By: sekhar ,Published On : December 9, 2020 / 04:09 PM IST
సిల్క్ స్మిత బయోపిక్.. అనసూయ క్లారిటీ..

Anchor Anasuya: యాంకర్‌ అనసూయ తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. అది కూడా వెర్సటైల్ యాక్టర్, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి సినిమాతో కావడం విశేషం. కాగా ఇటీవల అనసూయ షూటింగులో మేకప్ వేసుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.


ఆమె మిర్రర్‌లో మేకప్‌తో కనిపిస్తున్న తీరు చూస్తుంటే సీనియర్ నటి సిల్క్ స్మితలా ఉందని, సిల్క్ స్మిత బయోపిక్‌లో అనసూయ, సిల్క్ స్మితగా నటిస్తోందని సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.. అయితే ఈ వార్తలకు అనసూయ తన ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చింది.


తాను సిల్క్‌ స్మిత బయోపిక్‌లో నటించడం లేదని, అవన్నీ పుకార్లేనని చెప్పుకొచ్చింది. బుల్లితెర మీద స్టార్ యాంకర్‌గా రాణిస్తూ.. క్యారెక్టర్ నచ్చితే వెండితెరపై కూడా సత్తా చాటుతోంది అనసూయ. ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుని.. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘క్షణం’ వంటి సినిమాల్లో అలరించింది అనసూయ.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)