Apple Salaries: యాపిల్ ఇంజినీర్ల శాలరీలు కోట్లలోనే.. తగ్గేదేలే

సాధారణ కంపెనీలు ఇచ్చే లక్షల్లో జీతాలు చూసే అంత టెంప్టింగ్ గా ఉంటే మరి యాపిల్ లాంటి దిగ్గజ సంస్థ ఉద్యోగులకు కోట్లలో ముట్టజెపుతుందని తెలుసా..

Apple Salaries: యాపిల్ ఇంజినీర్ల శాలరీలు కోట్లలోనే.. తగ్గేదేలే

Apple Salaries

Apple Salaries: ఐటీ అంటేనే యువతలో ఓ క్రేజ్.. జీతాలు బాగా రావాలంటే అటు వైపు వెళ్లాల్సిందే అనేంత రేంజ్ లో ఫిక్స్ అయిపోతారు. సాధారణ కంపెనీలు ఇచ్చే లక్షల్లో జీతాలు చూసే అంత టెంప్టింగ్ గా ఉంటే మరి యాపిల్ లాంటి దిగ్గజ సంస్థ ఉద్యోగులకు కోట్లలో ముట్టజెపుతుందని తెలుసా.. ఆశ్చర్యపోకుండా ఇంజినీర్ల కోసం చెల్లిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి.

హోదా పరంగా జీతం ఏడాదికి ఇలా..
* సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కి 1,28,200- 2,20,000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.95 లక్షల నుంచి రూ.1.63 కోట్లు)
* సాఫ్ట్‌వేర్‌ డెవలెప్‌మెంట్‌ ఇంజినీర్లు 2,39,871 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1.78 కోట్లు)
* మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్లు 2,50,000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1.86 కోట్లు)
* టెస్టింగ్‌ డెవలెప్‌మెంట్‌ ఇంజినీర్‌ 137,275 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1.02 కోట్లు)
* ప్రొడక్షన్‌ సర్వీస్‌ ఇంజినీర్‌ 1,50,000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1.11 కోట్లు)
* సాఫ్ట్‌వేర్‌ డెవలెప్‌మెంట్‌ ఇంజినీర్‌ 1,25,000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.93లక్షలు)
* మెషిన్‌ లెర్నింగ్‌ రీసెర్చ్‌ ఇంజినీర్‌ 2,11,300 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 1.57 కోట్లు)

…………………………………….. : సుమ సినిమా సాంగ్ అదిరిపోయిందిగా..

ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ వెబ్‌సైట్‌ ‘బిజినెస్‌ ఇన్‌సైడర్‌’ ఈ వివరాలను వెల్లడించింది. ట్రెండ్‌కి తగ్గట్టు కొత్త మార్పులతో ఐఫోన్‌ (iPhone), మ్యాక్‌ (Macs) ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎన్నో కసరత్తులు చేసే అక్కడి డిజైనర్లు, ఇంజినీర్ల జీతం ఏమాత్రం ఉంటుందనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది. యూఎస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ ఫారిన్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌కు యాపిల్‌ కంపెనీ తెలియజేసిన వేతన వివరాలు సేకరించింది.