Onion : వేసవిలో ఆరోగ్యానికి రక్షణగా….ఉల్లిపాయ

పచ్చి ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల వ్యాధులు సంక్రమించే ప్రమాదం తగ్గుతుంది. వేసవి కాలంలో మన రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో జబ్బులు అధికంగా వస్తాయి.

Onion : వేసవిలో ఆరోగ్యానికి రక్షణగా….ఉల్లిపాయ

Summer Onion

Onion : భారతీయ వంటకాలలో ఉల్లికి అధికమైన ప్రాధాన్యత ఉంది. అన్ని రకాల ఆహార వంటకాల్లో ఉల్లిపాయను ఉపయోగిస్తారు. ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న నమ్మకంతో అనాదిగా ఒక నానుడి కూడా అందరి నోళ్లల్లో నానుతూ ఉంది. అదేంటంటే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న మాటలు నేటికి మనం వింటూనే ఉంటాం. ఉల్లిపాయ ఘాటుగా ఉంటుంది. దానిని కోసే సమయంలో దాని ఘాటుకు కళ్ల వెంట నీరు కారిపోతుంటుంది. ఇంతటి ఘాటైన ఉల్లిలో ఆహార విలువలు కూడా అధికంగానే ఉన్నాయి.

ఉల్లిపాయలో క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఉల్లిపాయ ఆరోగ్యానికి ఓ రక్షణ కవచంలా పనిచేస్తుంది. వేసవిలో అధిక దాహం, వడదెబ్బ, నీరసం, అలసట, వంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేసవిలో అధిక ఉష్ణ్రోగ్రతల నుండి రక్షించుకునేందుకు వివిధ రకాల ఆహారాలు తీసుకుంటుంటారు. అలాంటి వాటిలో ఉల్లిపాయది అగ్రస్ధానమనే చెప్పాలి. ఉల్లిపాయ వేడిని తగ్గించే గుణం కలిగి ఉంది. నీరసం, అలసటను దూరం చేయటంలో బాగా ఉపకరిస్తుంది.

వేసవిలో పెరుగన్న, మజ్జిగతో ఉల్లిపాయను తీసుకోవటం మంచిది. ఉల్లిపాయను నేరుగా తినలేని వారు కాస్త నిమ్మరసం, ఉప్పు చల్లుకుని తినవచ్చు. వడదెబ్బ నుండి రక్షించటంలో ఉల్లిపాయబాగా దోహదపడుతుంది. శరీరంలో ఉష్ణోగ్రతల సమతుల్యతకు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటానికి సహాయపడుతుంది. వేసవి వేడిని ఎదుర్కోవడానికి ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది. భోజనంతో పాటు లేదంటే సలాడ్‌లో ఉల్లిపాయను ఉపయోగించవచ్చు. అనేక తీవ్రమైన అనారోగ్యాలను నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. అనేక రోగాలను దూరం చేస్తుంది. ఉల్లిపాయలో యాంటీ హిస్టమైన్ తో కూడిన సిస్టీన్ ఉంటుంది. దీంతోపాటుగా అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్, ఫ్లేవనాయిడ్స్, క్రోమియం, క్వెర్సెటిన్ కూడా ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి హీట్ స్ట్రోక్‌ను నిరోధించడంలో సహాయపడతాయి.

పచ్చి ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల వ్యాధులు సంక్రమించే ప్రమాదం తగ్గుతుంది. వేసవి కాలంలో మన రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో జబ్బులు అధికంగా వస్తాయి. ఉల్లిపాయలో ఉండే పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వేసవిలో మన చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. చర్మపు మచ్చలను తగ్గించడానికి, తొలగించటానికి ఉపకరిస్తుంది. ఇది అద్భుతమైన స్కిన్ టానిక్‌గా ఉపయోగించవచ్చు. ఉల్లి జీర్ణకోశ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఉల్లిపాయ రసాన్ని ఎండ కారణంగా ఎర్రబడిన చర్మానికి పూస్తే మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. సన్‌బర్న్ నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

జ్వరం, చలిని లేకుండా చేయడానికి ఉల్లిపాయ ఒక ఔషదంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ ముక్కను గుడ్డలో చుట్టి నుదిటిపైన ఉంచితే జ్వరం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఎండాకాలంలో చాలా మంది ముక్కు వద్ద ఉంచి వాసన పీల్చుకుంటుంటారు. ఉల్లిపాయలు వేసవిలో ముక్కు నుండి రక్తస్రావం కాకుండా కాపాడతాయి. వేసవిలో సీజన్‌లో ఆరోగ్యంగా ఉండటానికి సలాడ్‌లు, శాండ్‌విచ్‌లు, బర్గర్‌లు, చాట్‌లు, స్నాక్స్ మొదలైన వాటిలో ఉల్లిపాయను జోడించి తీసుకోవటం మంచిది.