Assam : ఈ టీ పొడి ధర కిలో రూ. లక్ష..!

Assam : ఈ టీ పొడి ధర కిలో రూ. లక్ష..!

New Project (1)

Assam :  అస్సాం రాష్ట్రంలో లభించే టీ రకాల్లో ఒకటైనా పభోజన్‌ గోల్డ్‌ టీకి భారీ ధర దక్కింది. జోర్హాట్‌ లో జరిగిన వేలంలో కిలో ధర దాదాపు లక్ష రూపాయల వరకు పలికింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధిక ధరగా వ్యాపారులు చెబుతుండగా.. గోలఘాట్‌ జిల్లాలో ఈ సేంద్రియ టీ ఉత్పత్తి అవుతోంది. పభోజన్‌ ఆర్గానిక్‌ టీ ఎస్టేట్‌ నుంచి  అస్సాంకు చెందిన “ఎసా టీ” అనే సంస్థ  ఈ పొడిని కొనుగోలు చేసింది. ఈ టీ పొడికి పలికిన ధరను చూసి.. అక్కడివారు అవాక్కయ్యారు.
Presidential election: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా..? టీఎంసీకి రాజీనామా

అంతర్జాతీయగా ఈ టీ పొడికి మంచి డిమాండ్‌ పలుకుందని సమాచారం. పభోజన్‌ గోల్డ్‌ టీ..ఇతర టీల కంటే రుచిగా.. ప్రత్యేకంగా ఉంటుందంట. ఒక్కసారి ఈ టీ తాగితే మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుందని అక్కడివారు చెబుతున్నారు. దీనిని ఇష్టపడే వారు అంతర్జాతీయకంగా ఉన్నారని..అందుకే ఈ టీ పొడిని టీ బ్రాండ్‌ “ఎసా టీ” సంస్థ కొనుగోలు చేసింది. మరోవైపు అసోంలో తేయాకు ఎక్కువగా సాగవుతుంది. ఇక్కడే పండే తేయాతో పలు రకాల టీ పొడులను తయారు చేసి..ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారు.