బాలయ్య అంటే ఏంటో చూపిస్తా.. సాయి మాధవ్ బుర్రా..

బాలయ్య అంటే ఏంటో చూపిస్తా.. సాయి మాధవ్ బుర్రా..

Balayya – B.Gopal: నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న BB 3 (వర్కింగ్ టైటిల్) షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి.

బాలయ్య తర్వాతి సినిమా ఇటీవల ‘క్రాక్’ వంటి సంక్రాంతి బ్లాక్‌బస్టర్ కొట్టిన యువ దర్శకుడు గోపిచంద్ మలినేని డైరెక్షన్లో రూపొందనుంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

BB 3

తర్వాత నటసింహానికి ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ బ్లాక్‌బస్టర్ హిట్స్, ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన సీనియర్ అండ్ కమర్షియల్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా చెయ్యబోతున్నారు.

ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తుండడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. బాలయ్యతో సినిమా గురించి సాయి మాధవ్ మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణ గారి కెరీర్‌లో ఎమోషనల్ డ్రామాతో కూడిన యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవడంతో పాటు ల్యాండ్ మార్క్‌‌ సినిమాలుగా నిలిచిపోయాయి.

సెంటిమెంట్ నుంచి వచ్చే ఎమోషన్ అంటే.. మనకి బాలకృష్ణ పేరు మాత్రమే గుర్తొస్తుంది. బాలకృష్ణ అంటేనే సెంటిమెంట్ ప్లస్ ఎమోషన్ ప్లస్ యాక్షన్.. ఈ మూడింటినీ గానీ సరిసమానంగా బ్యాలెన్స్ చెయ్యగలిగితే నందమూరి అభిమానులే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరిస్తారు.. ఇప్పుడు నేను ఆయనతో చెయ్యబోతున్న కథ కూడా అదే విధంగా ఉంటుంది’’ అని సాయి మాధవ్ చెప్పారు.