Bandla Ganesh : హీరోలని రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడిగే అర్హత మనకి లేదు..

బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ''నేను నిర్మాత అశ్వినీదత్ గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అయన 50 ఏళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నారు. మనం ఏ హీరోని, ఏ డైరెక్టర్‌ను రెమ్యునరేషన్ తగ్గించుకోమనే అర్హత లేదు.

Bandla Ganesh : హీరోలని రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడిగే అర్హత మనకి లేదు..
ad

Bandla Ganesh : టాలీవుడ్ సమస్యలు రోజు రోజుకి ముదురుతున్నాయి. ఉన్న సమస్యలు చాలవన్నట్టు ప్రొడ్యూసర్ గిల్డ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్ మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. టాలీవుడ్ సమస్యలపై పరిష్కారం దొరికే వరకు షూటింగ్స్ బంద్ అన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ పై నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ వ్యతిరేకిస్తున్నారు. సమస్యలకి వారు ప్రతిపాదించిన పరిష్కారాలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రొడ్యూసర్ గిల్డ్ పై ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ..”అసలు ప్రొడ్యూసర్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియడంలేదు. హీరోలు రెమ్యునరేషన్స్ కరెక్ట్ గానే తీసుకుంటున్నారు. టికెట్ రేట్లు పెంచమని అడిగిన వాళ్ళే ఇప్పుడు తగ్గించమని అడుగుతున్నారు. వీళ్ళ వల్లే జనాలు థియేటర్స్ కి రావడం లేదు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.

Ashwini Dutt: ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయంపై నిర్మాత అశ్వనీ దత్ ఫైర్

అయితే అశ్వినీదత్ వ్యాఖ్యలపై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించి దీనిపై ఓ వాయిస్ నోట్ ని విడుదల చేశారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ”నేను నిర్మాత అశ్వినీదత్ గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అయన 50 ఏళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నారు. మనం ఏ హీరోని, ఏ డైరెక్టర్‌ను రెమ్యునరేషన్ తగ్గించుకోమనే అర్హత లేదు. కార్లలో రకరకాలు ఉంటాయి. కానీ ఒక్కో కారు ఒక్కో రేటు ఉంటుంది. హీరోలు కూడా అంతే ఒక్కో హీరోకి వాళ్ళ రేంజ్, వాళ్ళ మార్కెట్ బట్టి రేటు ఉంటుంది. మనం హీరోని ఎంత మార్కెట్ చేయగలమో చూసుకొని సినిమా చేయాలి. అంతే కానీ హీరోల రెమ్యునరేషన్ తగ్గించాలి అనేది తప్పు వాదన.

హీరో రేంజ్ ఎంత పెరిగితే మనకి అంత డబ్బు వస్తుంది. కాల్ షీట్లకి, షీట్లకు తేడా తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ప్యాకప్ అవుతుందో తెలియని వాళ్లు కూడా సినిమాలు తీస్తున్నారు. ఏ రోజు ఏ లైట్స్ వాడుతున్నారో, ఏ లొకేషన్ కి ఎంత ఛార్జ్ చేస్తారో కూడా తెలియని వాళ్ళు సినిమా తీస్తున్నారు. నా 15వ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చా. నేను నటుడిగా, మేనేజర్‌గా, నిర్మాతగా చేశాను, చేస్తాను. నన్ను ఇండస్ట్రీ ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. నేను సినిమాల్లోనే బతికాను, బతుకుతాను. కళామతల్లి దగ్గరకి రావాలని కోట్ల మంది అనుకుంటారు. కానీ మనకి అవకాశం వచ్చింది. ఈ ప్రొడ్యూసర్ గిల్డ్ అనవసరం. గిల్డ్ లో సినిమాలు తీయని వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా అనవసరం” అని అన్నారు. బండ్ల గణేష్ ఇలా ప్రొడ్యూసర్ గిల్డ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు.