Betel Leaves Cultivation : తమలపాకు సాగుతో.. లాభాల పంట

దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు రైతులు. అయితే గత కొన్నేళ్లుగా తమలపాకు సాగు పెద్దగా లాభాలు రాకపోవడంతో.. ఏఏటికి ఆయేడు సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తుంది. కానీ కొందరూ రైతులు మాత్రం తమలపాకు సాగును జీవనాధారంగా మల్చుకున్నారు.

Betel Leaves Cultivation : తమలపాకు సాగుతో.. లాభాల పంట

Betel Leaves Cultivation

Updated On : May 4, 2023 / 9:24 AM IST

Betel Leaves Cultivation : పెళ్లయినా.. పేరంటమైనా.. పండుగైనా.. ఏ శుభకార్యమైనా.. తమలపాకు ఉండాల్సిందే.. అది లేదంటే పెళ్లికి కాసేపు బ్రేక్‌ పడుతోంది.. పేరంటమైతే ఆగిపోతుంది.. పండుగైతే పద్ధతికాదని తేల్చేస్తారు. ఇలా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తమలపాకు కనిపించాల్సిందే.

READ ALSO : Betel Cultivation : తమలపాకు సాగులో చీడపీడలు, తెగుళ్ళు నివారణ

హిందూ సంప్రదాయంలో తమలపాకులకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు.. ఏ శుభకార్యమైనా తమలపాకులు ఉండాల్సిందే.. శుభకార్యక్రమాలకే కాకుండా, కిళ్లీ షాపుల్లోనూ తమలపాకులకు డిమాండ్‌ ఎక్కువే. ఎందుకంటే కిళ్లీ కట్టాలంటే తప్పనిసరిగా తమలపాకు వినియోగిస్తారు.

నాటి నుంచి నేటి వరకూ దానికున్న డిమాండ్‌ దానిదే. అలాంటి తమలపాకు రైతులు గత 2 ఏళ్లుగా నష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం మార్కెట్ బాగుండటంతో పచ్చిమ గోదావరి జిల్లా, లంక గ్రామాల్లో తమలపాకు సాగుచేస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : Betel Leaf : తమలపాకును తొడిమతో కలిపి ఎందుకు తినకూడదు?

అలాంటి తమలపాకును కొన్నేళ్లుగా ఉభయగోదావరి జిల్లాల్లో పండిస్తూ.. దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు రైతులు. అయితే గత కొన్నేళ్లుగా తమలపాకు సాగు పెద్దగా లాభాలు రాకపోవడంతో.. ఏఏటికి ఆయేడు సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తుంది. కానీ కొందరూ రైతులు మాత్రం తమలపాకు సాగును జీవనాధారంగా మల్చుకున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు , యలమంచిలి మండలం, దొడ్డపట్ల గ్రామానికి చెందిన ఓ రైతు.. తనకున్న కొద్దిపాటి భూమిలో 40 ఏళ్లుగా తమలపాకుల సాగు చేస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు.

READ ALSO : మధుమేహాన్ని అదుపులో ఉంచే తమలపాకు, నల్లజీలకర్ర కషాయం!

నోరు పండాలంటే తమలపాకు ఉండాలి. అయితే అలాంటి తమలపాకు పండించే రైతుల బతుకు మాత్రం పండటంలేదు గత కొన్నేళ్లుగా. దాదాపు 400 ఎకరాల్లో ఉన్న ఈ సాగు ప్రస్తుతం 40 ఎకరాలకు పరిమితమైంది. మార్కెట్ లో ధరలు ఎప్పుడు ఒకలాగే ఉండటం లేదు. అయినా  నష్టమైనా, కష్టమైనా రైతులు సాగు చేస్తూనే ఉన్నారు. ఏనాటికైనా తమ పంట పండకపోతుందా అని ఎదురుచూస్తూనే ఉన్నారు.