Bholaa Shankar : రెండేళ్లుగా భోళా శంకర్ షూటింగ్.. మొత్తం ఎన్ని రోజులు షూట్ చేశారో తెలుసా?

భోళా శంకర్ సినిమా ఎప్పుడో రెండేళ్ల క్రితమే ప్రకటించారు. కానీ ఈ సినిమా షూట్ మాత్రం చాలా స్లోగా జరిగింది. ఈ సినిమా ప్రకటించిన తర్వాత చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో వచ్చి హిట్స్ కొట్టారు.

Bholaa Shankar : రెండేళ్లుగా భోళా శంకర్ షూటింగ్.. మొత్తం ఎన్ని రోజులు షూట్ చేశారో తెలుసా?

Bholaa Shankar Movie Shoot Total Working days said by chiranjeevi

Updated On : August 7, 2023 / 7:45 AM IST

Bholaa Shankar Movie :  చిరంజీవి( Chiranjeevi), త‌మ‌న్నా(Tamannaah) జంట‌గా మెహర్ రమేష్(Meher Ramesh) ద‌ర్శ‌క‌త్వంలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కిన సినిమా భోళా శంక‌ర్‌(Bhola Shankar ). కీర్తి సురేష్(Keerthy Suresh) ఇందులో చిరంజీవి చెల్లి పాత్ర పోషిస్తుండగా సుశాంత్‌ (Sushanth) కీల‌క పాత్ర‌లో నటిస్తున్నాడు. ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది భోళా శంకర్.

తాజాగా భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సినిమాతో పాటు అనేక విషయాల గురించి కూడా మాట్లాడారు.

Chiranjeevi : ‘గాడ్ ఫాదర్’ టైటిల్ ఆ డైరెక్టర్ నుంచి తీసుకున్న చిరంజీవి.. చిరు అడిగితే ఆ డైరెక్టర్ ఏమన్నాడో తెలుసా?

భోళా శంకర్ సినిమా ఎప్పుడో రెండేళ్ల క్రితమే ప్రకటించారు. కానీ ఈ సినిమా షూట్ మాత్రం చాలా స్లోగా జరిగింది. ఈ సినిమా ప్రకటించిన తర్వాత చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో వచ్చి హిట్స్ కొట్టారు. ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో రాబోతున్నారు. కరోనా వల్ల, చిరంజీవి వేరే ప్రాజెక్ట్స్ వల్ల ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది. దీని గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. భోళా శంకర్ సినిమా ఎప్పుడో మొదలుపెట్టాం. రెండేళ్లుగా ఈ సినిమాకి పని చేసుకుంటూ వస్తున్నాం. ఈ సినిమాని 125 రోజులకు పైగా షూట్ చేశాం అని తెలిపారు.