Bigg Boss 5: మారిన టెలికాస్ట్ టైమ్.. కొత్త టైమ్ ఏంటంటే?
ఇండియాలో కూడా ఏ భాషలో అయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే బిగ్ బాస్ టాపిక్.. ఇప్పుడు తెలుగులో హాట్ టాపిక్ గా మారింది. కరోనాతో వచ్చిన గ్యాప్ వల్ల కాస్త ఆలస్యంగా మొదలుకాబోతోన్న..

Bigg Boss 5 Logo
Bigg Boss 5: ఇండియాలో కూడా ఏ భాషలో అయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే బిగ్ బాస్ టాపిక్.. ఇప్పుడు తెలుగులో హాట్ టాపిక్ గా మారింది. కరోనాతో వచ్చిన గ్యాప్ వల్ల కాస్త ఆలస్యంగా మొదలుకాబోతోన్న ఈ ఐదో సీజన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తెలుగులో ఐదవ సీజన్ టైం వచ్చేసింది. కొన్నిరోజులుగా కంటెస్టెంట్లు వీరే అంటూ లిస్ట్ కాస్త వైరల్ అవుతుండడంతో బిగ్ బాస్ అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ సెప్టెంబర్ 5 నుండి మొదలు కానుంది.
ఈ తాజా సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనుండగా చెప్పండి బోర్ డమ్ కి గుడ్ బై అంటూ ప్రోమోలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్లకు క్వారంటైన్ విధించగా సెప్టెంబర్ 4 నుండి బిగ్ బాస్ షూటింగ్ మొదలై 5న ప్రసారం కానుంది. యాంకర్ రవి, 7 ఆర్ట్స్ సరయు సుమన్, మహా న్యూస్ లహరి, కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్, యాంకర్ కమ్ నటుడు లోబో, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, ఫోక్ సింగర్ కోమలి, యాంకర్ కమ్ నటి వర్షిణి, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, సీరియల్ నటి నవ్య స్వామి, క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి, సిరి హనుమంత్, టిక్ టాక్ స్టార్ దుర్గారావు పేర్లు కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి.
అయితే, ఈసారి బిగ్ బాస్ షో ప్రసారమయ్యే సమయంలో మార్పులు చేసినట్లుగా వినిపిస్తుంది. ఇంతకు ముందు బిగ్ బాస్ షో సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9 గంటలు ప్రసారం కాగా ఈ సీజన్ మాత్రం రాత్రి 10 గంటల నుండి ప్రసారం కానున్నట్లు తెలుస్తుంది. వీక్ డేస్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని ఈ కొత్త టైమ్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. వారాంతంలో శని, ఆదివారాలలో మాత్రం యధావిధిగా రాత్రి 9.30 గంటలకే ప్రసారం కానుంది. ప్రస్తుతం ఇది ఒక ప్రచారమే కాగా.. బిగ్ బాస్ కర్టెన్ రైజర్ ఎపిసోడ్ లో ఇది రివీల్ చేయనున్నారట.