BiggBoss Nonstop : బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్.. బిందు మాధవి.. అందరూ అనుకున్నదే అయిందిగా..

బిందు మాధవి చెయ్యి ఎత్తి తనని బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ విన్నర్ గా ప్రకటించారు నాగార్జున. మొదటిసారి ఒక ఫిమేల్ కంటెస్టెంట్ బిగ్‌బాస్‌ ట్రోఫీ గెలుచుకుంది తెలుగులో............................

BiggBoss Nonstop : బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్.. బిందు మాధవి.. అందరూ అనుకున్నదే అయిందిగా..

Bindu Madhavi

BiggBoss Nonstop :  తెలుగు బిగ్‌బాస్‌ అయిదు సీజన్లని పూర్తి చేసుకొని ఆరోసారి బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ అంటూ ఓటీటీలో 24 గంటలు టెలికాస్ట్ అయింది. అయితే టీవీలో వచ్చినంత ఆదరణ ఓటీటీలో రాకపోవడంతో ఈ రియాల్టీ షోని తొందరగానే ముగించారు. ప్రతి వారం ఎవరో ఒకరిని గెస్ట్ గా తెచ్చి షోకి హైప్ తీసుకు వద్దామన్నా ట్రై చేసినా అది అంతగా ఫలించలేదు. అందుకే 100 రోజులు సాగాల్సిన షోని 83 రోజుల్లోనే క్లోజ్ చేసేశారు.

ఫిబ్రవరి 26న నాగార్జున హోస్టింగ్ తో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ బిగ్‌ రియాల్టీ షోకి ముగింపు పడింది. 18 మందితో మొదలైన ఈ షో 83 రోజులు సాగి చివరకు 7 గురు కంటెస్టెంట్స్‌ మిగిలారు. మొదటిసారి బిగ్‌బాస్‌ లో 7 గురు కంటెస్టెంట్స్ ఫైనల్ కి వెళ్లడం. బాబా భాస్కర్‌, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, అరియానా గ్లోరి, యాంకర్ శివ, అఖిల్‌ సార్థక్, బిందు మాధవి ఫైనల్ కి వెళ్లారు. చివరి ఎపిసోడ్ కావడంతో పలువురు సెలబ్రిటీలు ఈ షోకి వచ్చారు. సత్యదేవ్, మేజర్ సినిమా టీం, F3 సినిమా టీం రాగా, హీరోయిన్స్ మెహరీన్, దక్ష నగర్కర్, అప్సర రాణి ఈ షోలో తమ డ్యాన్స్ లతో మెప్పించారు.

మిగిలిన 7 గురిలో వరుసగా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయగా అరియానా గ్లోరి 10 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయింది. ఇక చివరకు అఖిల్‌ సార్థక్, బిందు మాధవి మిగిలారు. వారితో మాట్లాడించి స్టేజి పైకి తీసుకొచ్చారు నాగార్జున. వారిద్దరిలో బిందు మాధవి చెయ్యి ఎత్తి తనని బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ విన్నర్ గా ప్రకటించారు నాగార్జున. మొదటిసారి ఒక ఫిమేల్ కంటెస్టెంట్ బిగ్‌బాస్‌ ట్రోఫీ గెలుచుకుంది తెలుగులో. దీంతో బిందు మాధవి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

Rajendra Prasad : ఈ సినిమా హిట్ అవ్వకపోతే.. ఇక నేను మీకు కనపడను..

అయితే ముందు నుంచి కూడా చాలా మంది బిందు మాధవినే గెలుస్తుంది అని చెప్పారు. ఇప్పటి వరకు అందరూ అబ్బాయిలే గెలవడం, ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్లకి కప్ ఇచ్చే ఛాన్సులు తక్కువగా ఉండటం, చాలా మంది సెలబ్రిటీలు బిందు మాధవికి సపోర్ట్ చేయడం, కొత్త కంటెస్టెంట్స్ లో జనాలకి కాస్తో కూస్తో తెలిసింది బిందు మాధవి అవ్వడంతో ఈమెకే కప్ వస్తుందని మొదటి నుంచి అంతా భావించారు. అందరూ అనుకున్నట్టుగానే మొత్తానికి బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ లో బిందు మాధవి విన్నర్ గా నిలవగా ఈ షో పూర్తయింది. త్వరలోనే బిగ్‌బాస్‌ 6వ సీజన్ టీవిలో మొదలవ్వనున్నట్టు సమాచారం.

Bindu Madhavi With Cup

దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటిసారిగా ఒక మహిళ గెలిచింది. తెలుగు బిగ్‌బాస్‌ తొలి మహిళా విజేతగా బిందు మాధవి నిలిచింది. దీంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది బిందు. బిగ్‌బాస్‌ కప్‌ కొట్టాలన్న అఖిల్‌ ఆశలు మరోసారి అడియాశలే అయ్యాయి.