Happy Birthday Balakrishna : బాలయ్య జన్మదినం.. అభిమానులకు పర్వదినం..

స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి, అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, అభిమాన గణాన్ని సంపాదించుకుని, గత నాలుగు దశాబ్దాలకు పైగా నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.. నటసింహ నందమూరి బాలకృష్ణ..

Happy Birthday Balakrishna : బాలయ్య జన్మదినం..  అభిమానులకు పర్వదినం..

Happy Birthday Balayya

Happy Birthday Balakrishna : విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి, అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, అభిమాన గణాన్ని సంపాదించుకుని, గత నాలుగు దశాబ్దాలకు పైగా నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.. నటసింహ నందమూరి బాలకృష్ణ..

NBK

జూన్ 10న బాలయ్య 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బాలనటుడిగా ‘తాతమ్మకల’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి, తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించిన బాలకృష్ణకు ‘మంగమ్మగారి మనవడు’ హీరోగా ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. ఇక అక్కడినుండి వరస సినిమాలతో, తిరుగులేని మాస్ ఇమేజ్‌తో స్టార్ హీరోగా ఎదిగారు..

Akhanda : కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.. ‘అఖండ’ గా నట‘సింహా’ గర్జన..

‘క‌థానాయకుడు, వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి చ‌రిత్ర‌, ముద్దుల క్రిష్ణ‌య్య‌, భార్య‌భ‌ర్త‌ల బంధం, భ‌లే త‌మ్ముడు, సీతారామ‌క‌ల్యాణం, అన‌సూయ‌మ్మ‌గారి అల్లుడు, దేశోద్ధార‌కుడు, క‌లియుగ కృష్ణుడు, అపూర్వ స‌హోద‌రులు, మువ్వ‌గోపాలుడు, రాము, ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌తాప్‌, ర‌క్తాభిషేకం, భ‌లేదొంగ‌, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, ప్రెసిడెంటుగారి అబ్బాయి, నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, భైరవద్వీపం, ఆదిత్య 369, త‌ల్లిదండ్రులు, బంగారుబుల్లోడు, నిప్పుర‌వ్వ‌, బొబ్బిలి సింహం, వంశానికొక్క‌డు, పెద్దన్నయ్య, సమరసింహా రెడ్డి, సల్తాన్, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, డిక్టేటర్, గౌతమిపుత్ర శాతకర్ణి, జైసింహా, పైసా వసూల్.. ఇలా తన అద్భుతమైన నటనతో బాలయ్య జీవం పోసిన పాత్రలు ఎన్నో ఎన్నెన్నో..

Akhanda Title Roar : యూట్యూబ్‌లో ‘అఖండ’ అరాచకం.. TFI లో ఫాస్టెస్ట్ 50 మిలియ‌న్స్ వ్యూస్ టీజ‌ర్‌‌గా బాలయ్య రికార్డ్..

పాత్రలోకి పరకాయ ప్రవేశం చెయ్యడం, తన అసమాన నటనతో పోషించే పాత్రకు పరిపూర్ణ న్యాయం చెయ్యడం బాలయ్యకు తండ్రి నుండి వచ్చిన వారసత్వం.. గొప్ప గుణం.. మంచి లక్షణం.. సినిమా సినిమాకీ నటుడిగా ఎదుగుతూ, తన రికార్డులను తానే తిరగరాస్తూ, జయం వచ్చినప్పుడు పొంగిపోకుండా, అపజయాలకు కుంగిపోకుండా, దర్శక, నిర్మాతల హీరోగా మంచితనంతో మెలుగుతూ 100 సినిమాల మైలురాయిని దాటారు.. తన జెనరేషన్ హీరోల్లో.. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలు చేసిన ఒకే ఒక్క హీరో నందమూరి బాలకృష్ణ మాత్రమే.. నాకు నేనే పోటీ, నాకెవరూ రారు సాటి.. అని ఎన్నో సందర్భాల్లో తన నటనతో, సినిమా రికార్డులతో నిరూపించారు బాలయ్య..

Akhanda : బాలయ్య బర్త్‌డే ట్రీట్ వచ్చేసింది.. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ‘అఖండ’..

తండ్రి నట వారసత్వంతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసారు. ఇప్పటికి రెండుసార్లు హిందూపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్మేగా గెలుపొందారు. సినిమాలు, ప్రజాసేవతో పాటు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్న బాలయ్య ప్రస్తుతం తన 106వ సినిమాని ‘సింహా, లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి.. కల్మషం తెలియని పసి మనసు, స్వార్థం లేని ప్రేమ, నిండైన చిరునవ్వు బాలయ్య ఆభరణాలు.. ఆయన భోళా శంకరుడు.. అభిమానుల పాలిట దేవుడు.. సినీ రంగాలో మరెన్నో ఘన విజయాలు సాధించాలని కోరుకుంటూ.. బాలయ్య బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు..