Akhanda : కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.. ‘అఖండ’ గా నట‘సింహా’ గర్జన..

నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే ఉగాది కానుక ఇచ్చారు. ప్లవ నామ సంవత్సర పర్వదినాన ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి-బాలయ్య బాబు కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ ఫిలిం టైటిల్‌తో పాటుగా బిబి 3 టైటిల్ రోర్ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు..

Akhanda : కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.. ‘అఖండ’ గా నట‘సింహా’ గర్జన..

Akhanda Bb3​ Title Roar

Akhanda: నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే ఉగాది కానుక ఇచ్చారు. ప్లవ నామ సంవత్సర పర్వదినాన ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి-బాలయ్య బాబు కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ ఫిలిం టైటిల్‌తో పాటుగా బిబి 3 టైటిల్ రోర్ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు.

Akhanda

బాలయ్య నటిస్తున్న 106వ సినిమాకి గతకొద్ది రోజులుగా పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. కట్ చేస్తే.. ఎవరి అంచనాలకూ అందనివిధంగా ‘అఖండ’ అనే పేరు ఖరారు చేస్తూ, బాలయ్య షాకింగ్ లుక్ రివీల్ చేసి.. సినిమాపై అంచనాలు పెంచేశారు.

‘‘హర హర మహాదేవ.. శంభో శంకర.. కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’’.. అంటూ తన స్టైల్లో డైనమెట్ లాంటి డైలాగ్ పేల్చాడు బాలయ్య. అఘోరాగా నటసింహం లుక్ అదిరిందంటున్నారు అభిమానులు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.