Kareena Kapoor : ఒక్క సినిమాకు 12 కోట్ల రెమ్యూనరేషన్.? కరీనాను నెటిజన్లు ఆటాడుకుంటున్నారుగా..

కరీనా కపూర్ ఇద్దరు పిల్లల తల్లైనా ఇంకా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.. అవకాశాలున్నాయి కదా అని అమాంతం రేట్ పెంచేసింది కరీనా..

Kareena Kapoor : ఒక్క సినిమాకు 12 కోట్ల రెమ్యూనరేషన్.? కరీనాను నెటిజన్లు ఆటాడుకుంటున్నారుగా..

Boycott Kareena Kapoor Trends On Social Media

Kareena Kapoor: హీరోయిన్ లైమ్ లైట్లో ఉన్నంత కాలం ఓకే. పెళ్లయ్యి, పిల్లలు పుట్టారా.. ఇక హీరోయిన్ అనే మాట మర్చిపోవాల్సిందే. కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫ్యాషన్ దివా.. కరీనా కపూర్ ఇద్దరు పిల్లల తల్లైనా ఇంకా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అవకాశాలున్నాయి కదా అని అమాంతం రేట్ పెంచేసింది కరీనా. కరీనాకు దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్స్..

పెళ్లయ్యాక హీరోయిన్స్‌కి పెద్దగా అవకాశాలు, సినిమాలు రావు. కానీ బాలీవుడ్ హీరోయిన్ కరీనా మాత్రం పెళ్లయ్యి ఇద్దరు పిల్లలున్నా కూడా ఇంకా వరుస పెట్టి ఆఫర్లతో ఫుల్ బిజీ అవుతోంది. కొన్నాళ్లుగా మెటర్నిటీ లీవ్‌తో ఇండస్ట్రీలో అంతగా యాక్టివ్‌గా లేని కరీనా కపూర్ సడెన్‌గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ‘బాయ్‌కాట్ కరీనా’ అంటూ
సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విజయేంద్ర ప్రసాద్ కథకి అలౌకిక్ దేశాయ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ ‘సీత’ కు సంబంధించి టైటిల్ రోల్ కోసం కరీనా కపూర్‌ని అప్రోచ్ అయ్యిందని, సీత క్యారెక్టర్ చెయ్యడానికి ఏకంగా 12 కోట్ల రెమ్యూనరేషన్ అడిగిందని సోషల్ మీడియాలో న్యూస్ నడుస్తోంది. జనరల్‌గా సినిమాలకు 6 నుంచి 8 కోట్ల వరకూ తీసుకునే కరీనా ఇప్పుడు డబుల్ రేట్ అడగడంతో నెటిజన్స్ ఫుల్‌గా సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు.

సీత క్యారెక్టర్ కోసం అంత రెమ్యూనరేషన్ అడుగుతారా..? అసలు నువ్వు సీత కన్నా శూర్పణక క్యారెక్టర్‌కి బాగా సూట్ అవుతావ్ అంటూ సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. అంతేకాదు ఇంకొంతమందైతే సీతకి కరీనా బదులు కంగనా అయితే బాగా సూట్ అవుతుందంటున్నారు. మరికొంతమందైతే అసలు ఖాన్‌కి భార్యగా ఉన్న నువ్వు సీత పాత్ర చెయ్యడానికి సూట్ అవ్వవు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇన్ని ట్రోల్స్ నడుస్తున్నా.. కరీనా మాత్రం ఇప్పటి వరకూ రియాక్ట్ అవ్వలేదు..