Mayawati: బద్రినాథ్, జ్ఞానవాపి వివాదాలను ప్రస్తావిస్తూ బీజేపీ, ఎస్పీలపై మండిపడ్డ మాయావతి

Mayawati: బద్రినాథ్, జ్ఞానవాపి వివాదాలను ప్రస్తావిస్తూ బీజేపీ, ఎస్పీలపై మండిపడ్డ మాయావతి

Mayawati Lashes BJP and SP: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా రెండు వివాదాలు కొనసాగుతున్నాయి. ఒకటేమో జ్ఞానవాపి మసీదు విషయమై సాగుతోంది. ఇది భారతీయ జనతా పార్టీ కేంద్రంగా ప్రారంభమైంది. మసీదుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు పెద్ద గొంతుకను ఇస్తున్నారు. ఇక దీనికి అనుబంధంగా తాజాగా బద్రీనాథ్ ఆలయ వివాదం ప్రారంభమైంది. మసీదు కింద గుడి ఉన్నట్లే, గుడి కింద బౌద్ధ విహారం ఉందంటూ సమాజ్‭వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలతో తాజా వివాదం నెలకొంది. అయితే ఈ రెండు వివాదాలు ఆ రెండు పార్టీల రాజకీయ స్వలాభం కోసమేనని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Modi And Pawar: ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడంపై తీవ్ర విమర్శల నేపథ్యంలో.. పరోక్షంగా వివరణ ఇచ్చుకున్న శరద్ పవార్

మంగళవారం తన ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘బౌద్ధ విహారం కూల్చివేత, బద్రీనాథ్ ఆలయ నిర్మాణంపై సమాజ్‭వాదీ పార్టీ ప్రకటన.. ఇప్పుడు కోర్టులో పెండింగ్‌లో ఉన్న జ్ఞానవాపి కేసుకు సంబంధించి వివాదాన్ని పెంచేలా బీజేపీ చేసిన ప్రకటన.. ఈ రెండు పార్టీల రాజకీయ కుట్ర ఫలితమే ఇదంతా. ఇది చాలా తీవ్రమైనది. చాలా ఆందోళన కలిగిస్తుంది కూడా. జ్ఞాన్‌వాపి కేసులో ఏఎస్‌ఐ సర్వే చేయించాలనే వివాదం హైకోర్టులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉంది. ఆ వివాదాన్ని ఇప్పుడు ప్రస్తావించడం అనవసరమే లేదు. కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండటం ముఖ్యం. అంతకు మించి చేయడం అగౌరవనీయం’’ అని మాయావతి ట్వీట్ చేశారు.

Caste Survey: నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఊరట.. కులగణనకు లైన్ క్లియర్ చేసిన పాట్నా హైకోర్టు