అకౌంట్‌లో పడేది నామమాత్రమే.. గ్యాస్ రాయితీ నాలుగు రూపాయిలే!

అకౌంట్‌లో పడేది నామమాత్రమే.. గ్యాస్ రాయితీ నాలుగు రూపాయిలే!

గ్యాస్ రాయితీలు రోజురోజుకు తగ్గిపోయి.. గతంలో పడే రూ. 500 కాస్తా ఇప్పుడు రూ.4కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రదేశాల్లో రాయితీ క్షీణించి రూ. 4కి కూడా చేరుకుంది. అంతుకుముందు గ్యాస్ రాయితీ అకౌంట్లలో రూ. 500 పడుతూ ఉండేది. ఇప్పుడు అది కాస్త రూ. 4, రూ.16 అలా అకౌంట్లో వచ్చి పడుతోంది. గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న రాయితీ బాగా తగ్గిపోవడంతో విజయవాడలో సిలిండర్ ధర రూ. 816గా ఉండగా, కష్టమర్ల అకౌంట్లో 16 రూపాయలు మాత్రమే పడుతోంది.

ఏపీ ప్రభుత్వ ప్రతిపాదిత రాజధాని నగరం విశాఖలో సిలిండర్ ధర రూ. 800కు చేరుకోగా నాలుగు రూపాయల రాయితీ మాత్రమే లభిస్తోంది. తిరుపతిలో సిలిండర్ ధర రూ. 830 కాగా, 17 రూపాయల రాయితీ లభిస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో సిలిండర్ ధర రూ. 863 కాగా, ఇక్కడ రూ.49 రాయితీ వస్తోంది. ఊరికి, ఊరికి మధ్య రాయితీ ఒక్కోలా జమ అవుతున్నా ఎక్కడా రూ. 50కి మించి లేకపోవడం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉండగా.. వాణిజ్య వినియోగదారుల్ని మినహాయిస్తే.. సుమారు 1.15 కోట్ల కుటుంబాలు ప్రతి నెలా గ్యాస్‌ సిలిండర్లను వినియోగిస్తూ ఉండగా.. రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులపై ఏడాదికి రూ.4,140 కోట్ల భారం పడుతోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర గత మూడు నెలల్లో రూ.200 పెరగగా.. నవంబరులో రూ.616 ఉన్న సిలిండర్ ధర ఫిబ్రవరి నెలలో మూడుసార్లు పెరిగి రూ. 816కు చేరుకుంది. ధర రూ. 200 పెరిగినా రాయితీ మాత్రం రూపాయి కూడా పెరగలేదు.

రాష్ట్రంలో వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించిన తొలి రోజుల్లో.. ఒక్కో సిలిండర్‌పై రూ.170 నుంచి రూ.500 వరకు రాయితీ రూపంలో కష్టమర్ బ్యాంక్ అకౌంట్‌లో పడేవి. రాయితీ పోను సగటున రూ.500 వరకు కష్టమర్ బరించేవాడు.. కానీ ఇప్పుడు కష్టమరే రూ.800 భరించవలసిన పరిస్థితి.