Chiranjeevi: ఆయన తొలిపాటకి నేనే నర్తించా.. గాయకుడు ఆనంద్‌ మృతికి చిరు సంతాపం

కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కేసులు లక్షల్లో మరణాలు వేలల్లో నమోదవుతుండగా తెలుగు సినీ పరిశ్రమలో కరోనా విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. సీనియర్‌ సినీ గాయకుడు జి.ఆనంద్‌ (67) కరోనా బారిన పడి గురువారం రాత్రి హఠాన్మరణం చెందారు.

Chiranjeevi: ఆయన తొలిపాటకి నేనే నర్తించా.. గాయకుడు ఆనంద్‌ మృతికి చిరు సంతాపం

Chiranjeevi

Chiranjeevi: కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కేసులు లక్షల్లో మరణాలు వేలల్లో నమోదవుతుండగా తెలుగు సినీ పరిశ్రమలో కరోనా విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. సీనియర్‌ సినీ గాయకుడు జి.ఆనంద్‌ (67) కరోనా బారిన పడి గురువారం రాత్రి హఠాన్మరణం చెందారు. కరోనా చికిత్సలో భాగంగా సకాలంలో వెంటిలేటర్‌ లభించకపోవడంతో ఆనంద్‌ మృత్యువాత పడినట్లు తెలిసింది. కాగా, జి.ఆనంద్ మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

‘ఎన్నియ‌ల్లో.. ఎన్నియ‌ల్లో… ఎందాకా.. అంటూ నా సినీ జీవితంలో తొలి పాట‌కి గాత్రదానం చేయ‌డం ద్వారా నాలో ఒక భాగ‌మైన మృదు స్వ‌భావి, చిరు ద‌ర‌హాసి శ్రీ జి.ఆనంద్ గారు క‌ర్క‌శ‌మైన క‌రోనా బారిన ప‌డి ఇక లేరు అని న‌మ్మ‌లేక‌పోతున్నాను. మొట్ట‌మొద‌టి సారి వెండి తెర‌మీద ఆయ‌న గొంతు పాడిన పాట‌కే నేను న‌ర్తించాన‌నే విష‌యం ఆయ‌న‌తో నాకు ఒక అనిర్వ‌చ‌నీయ‌మైన, అవినాభావ బంధం ఏర్ప‌ర‌చింది. ఆయ‌న ప్ర‌స్థానం న‌న్ను వెంటాడే విషాదం. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం తెలుపుతున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

కాగా, జి.ఆనంద్‌ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగమ్‌ గ్రామం. ఆయన ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత రంగంలో కొనసాగుతున్నారు. స్వరమాధురి సంస్థ స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6,500 పైగా కచేరీలు నిర్వహించగా ప్రస్తుతం సినీ గాయనీ గాయకులుగా ఉన్న పలువురిని ఈ సంస్థ ద్వారా ప్రోత్సహించారు. అందుకే సంగీత ప్రముఖులు ఆనంద్ మృతికి తీవ్ర షాక్ లో ఉన్నారు.

Read: RRR Movie: ధైర్యంగా కరోనాను అడ్డుకుందాం.. కష్టకాలంలో ఆర్ఆర్ఆర్ టీం అద్భుత సందేశం!