RRR Movie: ధైర్యంగా కరోనాను అడ్డుకుందాం.. కష్టకాలంలో ఆర్ఆర్ఆర్ టీం అద్భుత సందేశం!

దేశంలో మరోసారి కరోనా కరాళ నృత్యం కొనసాగిస్తుంది. ప్రజలు మహమ్మారి ధాటికి విలవిలలాడిపోతున్నారు. పోయినట్లేపోయి మళ్ళీ ప్రజలను చుట్టుముట్టేసిన కరోనాను జయించేందుకు ఇటు ప్రభుత్వాలు, పలువురు వ్యక్తులు, సంస్థలు తమ విధిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

RRR Movie: ధైర్యంగా కరోనాను అడ్డుకుందాం.. కష్టకాలంలో ఆర్ఆర్ఆర్ టీం అద్భుత సందేశం!

Rrr Movie

RRR Movie: దేశంలో మరోసారి కరోనా కరాళ నృత్యం కొనసాగిస్తుంది. ప్రజలు మహమ్మారి ధాటికి విలవిలలాడిపోతున్నారు. పోయినట్లేపోయి మళ్ళీ ప్రజలను చుట్టుముట్టేసిన కరోనాను జయించేందుకు ఇటు ప్రభుత్వాలు, పలువురు వ్యక్తులు, సంస్థలు తమ విధిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో కొందరు సెలబ్రిటీలు సేవా కార్యక్రమాలతో పాటు సందేశ సాయం చేస్తున్నారు. గత ఏడాది కరోనాను జయించే ప్లాస్మా దానంపై అవగాహనా కల్పించిన ఆర్ఆర్ఆర్ సినిమా టీం ఈసారి కరోనా మీద మరో సందేశాన్ని రూపొందించి విడుదల చేశారు.

గత ఏడాది రూపొందించిన సందేశ చిత్రాలలో తారక్, చరణ్ మాత్రమే ఉండగా ఈసారి బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవ్ గన్ లతో సహా దేశమంతటికీ ఒకేసారి సందేశాన్ని అందించారు. ఒక్కొక్కరూ ఒక్కో భాషలో ప్రస్తుత కష్ట కాలాన్ని విశదీకరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోని కలిసి కట్టుగా ధైర్యంగా నిలబడి కరోనాను అడ్డుకోవాలని, కుదిరిన ప్రతీ ఒక్కరూ వాక్సిన్ వేయించుకొని మన కుటుంబీకులు, స్నేహితులు, దేశాన్ని కాపాడుకోవాలని సందేశం ఇచ్చారు.

ఇందులో హీరోయిన్ అలియా చేత తెలుగులో సందేశాన్ని వినిపించడం విశేషం కాగా.. చరణ్ తమిళం, ఎన్టీఆర్ కన్నడ, రాజమౌళి మలయాళంలో సందేశాన్ని అందించారు. ఇక అజయ్ దేవగన్ హిందీలో తన సందేశాన్ని వినిపించగా ప్రస్తుతం ఈ సందేశాత్మక చిత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మరి వారి సూచనలు, సలహాలు తప్పకుండ ప్రతీ ఒక్కరూ పాటించి తిరిగి ఆరోగ్యకరమైన రోజులను మళ్ళీ తెచ్చుకోవాలని.. ఈ కరోనా మహమ్మారిని మన సమాజం నుండి తరిమేయడంలో మనమందరం భాగస్వామ్యులు కావాలని కోరుకుందాం!