Coal Mine : జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. అక్రమ గనిలో ఐదుగురు మృతి..!

జార్ఖండ్‌‌లో ఘోర ప్రమాదం జరిగింది. ధన్‌బాద్‌లో అక్రమ బొగ్గు గని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

Coal Mine : జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. అక్రమ గనిలో ఐదుగురు మృతి..!

Five People Killed In Coal

Dhanbad Mine : జార్ఖండ్‌‌లో ఘోర ప్రమాదం జరిగింది. ధన్‌బాద్‌లో అక్రమ బొగ్గు గని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 5 మంది కార్మికులు అక్కడిక్కడే మరణించారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మంగళవారం జరిగింది. ప్రమాద సమయంలో మరికొంత మంది బొగ్గు గనిలోని చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కూలిపోయిన బొగ్గు గని (coal mine) వద్ద పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసరిగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ధన్‌బాద్‌ (Dhanbad) లోని నిర్సా బ్లాక్‌లోని ఈసీఎల్ ముగ్మా ప్రాంతంలో ఉన్న అక్రమ మైనింగ్‌లో ఈ ఘటన జరిగింది. రాంచికి 400 కిలోమీటర్ల దూరంలోని ధన్ బాద్ జిల్లాకు చెందిన గోపినాథ్ పూర్ లో ఈ ఫ్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు.

అయితే ఈ బొగ్గు గతంలోనే గనిని మూసివేయగా.. ఇప్పుడు దాన్ని చట్టవిరుద్ధంగా తెరిచినట్లు చెబుతున్నారు. మైనింగ్ పరికరాలు 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. గని పైకప్పు మొత్తం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందారు. మరో 12మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారని అధికారులు అనుమానిస్తున్నారు. మైనింగ్ కుప్పకూలిన సమయంలో అందులో పనిచేస్తున్న కార్మికుల్లో కొంత మందిని ప్రాణాలతో రక్షించగా.. నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఐదుగురు మరణించినట్టుగా పోలీసులు ధృవీకరిస్తున్నారు. గోపీనాథ్‌పూర్ కొలీరీ మేనేజర్ ఎల్‌కే సింగ్ నిర్సా పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు అందింది. బొగ్గును దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారలు వెల్లడించారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. రూరల్‌ ఎస్పీ రిష్మా రమేషన్‌ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

Read Also : Guntur Jinnah Tower: గుంటూరులో జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు..రంగులే కాదు పేరు మార్చాలని బీజేపీ డిమాండ్