CM Kejriwal : ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం, కాపాడమంటూ..కేంద్రానికి మొర

దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ సంక్షోభంపై సీఎం కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. ప్రస్తుత పరిస్థితి క్లిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు.

CM Kejriwal : ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం, కాపాడమంటూ..కేంద్రానికి మొర

Delhi Cm Coal

Coal Shortage In Delhi : దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ సంక్షోభంపై సీఎం కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. ప్రస్తుత పరిస్థితి క్లిష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. బొగ్గు కొరతపై అనేక రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాస్తున్న సంగతి తెలిసేందే. కేంద్రానికి వ్యతిరేకంగా గళాలు వినిపిస్తున్నాయి. అందులో కేజ్రీవాల్ కూడా చేరారు. బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభం గురించి అనేక రాష్ట్రాల సీఎంలు కేంద్రానికి లేఖలు రాశారనే విషయాన్ని గుర్తు చేశారు. బొగ్గు కొరత తీవ్రంగా ఉందని, పరిస్థితిని మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉందని, విద్యుత్ సంక్షోభం ఎక్కువగా జాతీయ స్థాయిలో ఉందని మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి Pradhuman Singh వెల్లడించారు.

Read More : Apple iPhone 12 : ఐఫోన్ ఆర్టర్ చేస్తే..2 నిర్మా సబ్బులొచ్చాయి

మరోవైపు విద్యుత్ సంక్షోభంపై బీజేపీపై ఎదురుదాడికి దిగుతోంది కాంగ్రెస్. మోదీ కావాలనే బొగ్గు కొరత సంక్షోభం సృష్టించారని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఈ సంక్షోభం కారణంగా..ఓ ప్రైవేటు కంపెనీ డబ్బు సంపాదిస్తోందా ? దీనిపై ఎవరు దర్యాప్తు చేస్తారని మాజీ మంత్రి జైరామ్ రమేశ్ ఆరోపించారు. విద్యుత్ డిమాండ్ తీర్చడానికి తగినంత నిల్వలు ఉన్నాయని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. బొగ్గు కొరత ఉందని, విద్యుత్ సంక్షోభం నెలకొంటుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ స్పందించిన సంగతి తెలిసేందే. దేశంలో పుష్కలంగా బొగ్గు అందుబాటులో ఉందని చెప్పుకొచ్చింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయం వద్దని బొగ్గు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.