Covid Cases: దేశవ్యాప్తంగా లక్షా 10వేల కొవిడ్ కేసులు

కరోనా విజృంభణ భారతదేశంలో రోజురోజుకు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 17వేల 92కొత్త కేసులు కాగా 29 మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే, కేరళ, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, ఒడిశా రాష్ట్రంలో అధికంగా రోజువారీ కోవిడ్ కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.

Covid Cases: దేశవ్యాప్తంగా లక్షా 10వేల కొవిడ్ కేసులు

Covid 19 New Cases

Covid Cases: కరోనా విజృంభణ భారతదేశంలో రోజురోజుకు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 17వేల 92కొత్త కేసులు కాగా 29 మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే, కేరళ, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, ఒడిశా రాష్ట్రంలో అధికంగా రోజువారీ కోవిడ్ కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో లక్షా 9వేల 568 యాక్టివ్ కేసులుండగా, దేశ జనాభాతో పోలిస్తే 0.2 శాతంగా ఉన్నాయి. దీనిని బట్టి పాజిటివిటీ రేటు 4.14 శాతానికి చేరినట్లు చెబుతున్నారు. దేశంలో ఇప్పటివరకు 4కోట్ల 34 లక్షల 86వేల 326 కేసులు నమోదు కాగా 5లక్షల 25వేల 168 మరణాలు వాటిల్లాయి.

కరోనా రికవరీ రేటు దేశంలో 98.54 శాతంగా ఉండగా శుక్రవారం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14వేల 684గా ఉంది. మొత్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 4కోట్ల 28లక్షల 51వేల 590 మంది కోలుకోగలిగారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read Also: భారత్‌లో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి