Covid Cases: భారత్‌లో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి

భారత్‌లో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 96 వేలు దాటింది. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 11వేల 793 కొత్త కేసులు నమోదు కాగా 27 మరణాలు సంభవించాయి. ఒకరోజు ముందుతో పోలిస్తే.. కొవిడ్ కొత్త కేసులు 30 శాతం తగ్గడం సంతోషించదగ్గ విశేషం.

Covid Cases: భారత్‌లో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి

Covid Test

Covid Cases: భారత్‌లో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 96 వేలు దాటింది. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 11వేల 793 కొత్త కేసులు నమోదు కాగా 27 మరణాలు సంభవించాయి. ఒకరోజు ముందుతో పోలిస్తే.. కొవిడ్ కొత్త కేసులు 30 శాతం తగ్గడం సంతోషించదగ్గ విశేషం.

ప్రస్తుతం దేశంలో 96వేల 700 యాక్టివ్ కేసులు రిజిష్టర్ అయి ఉండగా.. రోజువారీ పాజిటివిటి రేటు 2.49 శాతానికి చేరింది. దేశంలో ఇప్పటివరకూ నమోదైన కేసులు 4కోట్ల 34లక్షల 18వేల 839 ఉండగా 5లక్షల 25వేల 47మరణాలు వాటిల్లాయి. దీంతో పోలిస్తే యాక్టివ్ కేసులు 0.22 శాతంగా ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.57 శాతం ఉండగా.. ఒక్కరోజులో కరోనా నుంచి 9వేల 486 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ అయిన వారి సంఖ్య 4కోట్ల 27లక్షల 97వేల 92 మంది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read Also: మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. నిన్నటికంటే 24శాతం అధికం

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ 529 రోజులుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 197.31 కోట్ల మంది వ్యాక్సిన్ డోసుల టీకాలు అందజేశారు. సోమవారం ఒక్కరోజే 19లక్షల 21వేల 811 డోసుల టీకాలు పంపిణీ జరిగినట్లు తెలుస్తుంది.

మొత్తంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 197కోట్ల 31లక్షల 43వేల 196 డోసుల టీకాలు అందజేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.