Mahindra Thar: హాలీవుడ్ రేంజ్‌కు మించి మహీంద్రా థార్ 2021

మహీంద్రా మోడల్స్‌లో బీభత్సమైన క్రేజ్ దక్కించుకున్న మోడల్ థార్. ఇప్పుడు మెర్సిడెస్-బెంజ్ జీ క్లాస్, జీప్ గ్లాడియేటర్, రాంగ్లర్‌ల బాటలోనే 6×6 వెర్షన్ అందుబాటులోకి రానుందట. ఈ మేరకు మోస్ట్ ఫ్యామస్ డిజైన్ హౌజ్ అయిన DC2 కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది.

Mahindra Thar: హాలీవుడ్ రేంజ్‌కు మించి మహీంద్రా థార్ 2021

Mahindra Thar

Mahindra Thar: మహీంద్రా మోడల్స్‌లో బీభత్సమైన క్రేజ్ దక్కించుకున్న మోడల్ థార్. ఇప్పుడు మెర్సిడెస్-బెంజ్ జీ క్లాస్, జీప్ గ్లాడియేటర్, రాంగ్లర్‌ల బాటలోనే 6×6 వెర్షన్ అందుబాటులోకి రానుందట. ఈ మేరకు మోస్ట్ ఫ్యామస్ డిజైన్ హౌజ్ అయిన DC2 కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది.

హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ కు వాడే కార్లకు మించిన లుక్ తో రెడీ చేశారు. రెగ్యూలర్ థార్‌ను ఇలా మార్చడానికి దాదాపు రూ.55లక్షల వరకూ ఖర్చు అవుతుందని చెప్పింది. దానికి 28శాతం జీఎస్టీ కలిపితే.. మాడిఫికేషన్ మొత్తానికి అయ్యే ఖర్చు రూ.70లక్షలు వరకూ అవ్వొచ్చు.

మాడిఫికేషన్ చేయడం కోసం 120రోజుల సమయం పడుతుందట. థార్ ఎలాంటి మోడల్ అయినా 6×6వెర్షన్ గా మార్చుకోవచ్చు. దాని కోసం మీరు చేయాల్సిందల్లా ముందు థార్ మోడల్ కొని డీసీకి అప్పగించడమే. థార్ ధర రూ.12.78లక్షల నుంచి రూ.15.08వరకూ పలుకుతుంది. కాకపోతే ఓనర్లు ఆర్టీఓ నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. DCకూడా ఈ ప్రాజెక్టు మీదే పనిచేస్తుంది.

Thar 1

Thar 1

ఈ వెర్షన్ లో వాడే ప్యానెల్స్ అన్నీ కొత్తవే. ఇప్పటి వరకూ ఉన్న మోడల్స్ కు భిన్నంగా దీనిని రెడీ చేశారు. ముందువైపు ఆరు ప్లేట్ల గ్రిల్ తో ఉండగా మెటల్ మాత్రం స్మూత్ గా ఎరో డైనమిక్ గా ఉంది. గతుకుల రోడ్ పైన కూడా తట్టుకోవడానికి మెటల్ బంపర్ పెట్టినట్లుగా కనిపిస్తుంది.

Thar 2

Thar 2

హెడ్ ల్యాంప్స్, బ్యానెట్, మిర్రర్స్, ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్ ప్రతి దానిలో లుక్ మార్చేశారు. వెనుక వైపు ఒక టన్ వరకూ లోడ్ వేసుకునేందుకు అనువుగా రూపొందించారు. అంతేకాకుండా స్పేర్ టైర్ పెట్టుకునేందుకు కూడా వీలుగా ఉంచారు. లోపలి వైపు ఇంటరీయర్ ను రెడ్ అండ్ బ్లాక్ తో లెథర్ మెటేరియల్ తో సాఫ్ట్ టచ్ వచ్చేలా క్రియేట్ చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో అయితే ఈ వెర్షన్ కోసం 4.0లీటర్ ఇంజిన్ వాడతారట.