బైక్‌లు.. కార్లలో మీటర్ల రీడింగ్ హ్యాక్ చేస్తున్నారా.. ఇలా కనుక్కోండి

బైక్‌లు.. కార్లలో మీటర్ల రీడింగ్ హ్యాక్ చేస్తున్నారా.. ఇలా కనుక్కోండి

Bike Meter Reading: ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు.. ఇండియాలో వాడేసిన కార్ల అమ్మకాలు పెరిగిపోతున్నాయి. కొత్త కార్ కొనడానికి బదులు చాలా మంది పాత కార్ కొనడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అలా కొనుగోలు చేసే సమయంలో కొన్ని రకాల మోసాలు జరగడం కామన్ గా ఫేస్ చేసే ఉంటాం. వీటిల్లో రెగ్యూలర్ గా చూసేదేంటంటే.. మీటర్ రీడింగ్ మార్చేయడం. లేదా ఆగిపోయి ఉన్న మీటర్ చూపించడం.

పాత కార్లలో దాదాపు మనం చూసేది ఎనలాగ్ మీటర్లే.. వీటిని మేనేజ్ చేయడం చాలా ఈజీ. ఏ వర్క్ షాప్ లోనైనా మార్పులు చేసేయొచ్చు. లక్షల్లో రీడింగ్ ను వేలల్లోకి తగ్గించేసుకోవచ్చు. అలాంటి ట్యాంపరింగ్ ను ఎలా తెలుసుకోగలం. అది చేసిన మెకానిక్ ను బట్టి ఉంటుంది. డిజిట్లు కరెక్ట్ గా సెట్ అయి ఉండకపోవడాన్ని బట్టి అది మేనేజ్ అయిందని తెలుసుకోవచ్చు.

odometer 2

odometer 2

ఇంకొక పద్ధతి ఏంటంటే మీటర్ కచ్చితంగా పదివేల కిలోమీటర్లు తిరిగిందా అనేది చూసుకోవాలి. ట్యాంపర్‌డ్ ఆడో మీటర్లలో డిజిట్లు సరైన పద్ధతిలో తిరగవు. నిదానంగా లేదంటే అతి వేగంగా తిరుగుతుంటాయి.

మార్కెట్లో డిజిటల్ ఆడోమీటర్ వచ్చాక.. చాలా మందికి ట్యాంపరింగ్ చేయడం కష్టంగానే ఉంది. నిజానికి టెక్నాలజీని వాడుకునే దాన్ని బట్టి వాటిని కూడా రివర్స్ చేసేయొచ్చట. కాకపోతే ఫిజికల్ గా చేయాల్సింది ఏముండదు. మీటర్ రిపైర్ షాప్స్ లో ల్యాప్ టాప్ కు కనెక్ట్ చేసి చిప్ ను రీసెట్ చేస్తారు. అలా చేయడం వల్ల.. రీడింగ్ తగ్గడం లేదంటే ఆగిపోవడం జరుగుతాయి. ఒకవేళ మనం తెలుసుకోవాలి అనుకుంటే.. స్క్రూ డ్రైవర్ మరకలు, ఆవిరి అందులోకి వెళ్లడం లాంటివి గమనించొచ్చు.

వెహికల్ ను చూసి కూడా ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. లక్ష కిలోమీటర్లు తిరిగిన వాహనం క్యాబిన్ పరిస్థితి వేరేలా ఉంటుంది. స్టీరింగ్ వెహికల్, బ్రేక్ పెడల్, గేర్ నాబ్ లాంటి భాగాలు చెప్పేస్తుంటాయి. అలాంటి కార్ ఎక్స్‌పీరియన్స్ చేశారా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి.