10tv Conclave: అందుకే రాయిదాడి టీడీపీ పనే అని కామెంట్ చేశా: వెలంపల్లి శ్రీనివాస్

దేవుడి దయ వల్లే తాను, సీఎం జగన్ క్షేమంగా ఉన్నామని వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు

10tv Conclave: అందుకే రాయిదాడి టీడీపీ పనే అని కామెంట్ చేశా: వెలంపల్లి శ్రీనివాస్

Vellampalli Srinivas

Updated On : April 26, 2024 / 2:50 PM IST

కావాలని దాడి చేయించుకుని కళ్లు పోగొట్టుకుంటామా? అని వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో ఆయన మాట్లాడారు. తనపై, సీఎం జగన్ పై ఎవరికీ వ్యక్తిగత శత్రుత్వం లేదని తెలిపారు. అందుకే రాయిదాడి టీడీపీ పనే అని కామెంట్ చేశానని అన్నారు. రాయిదాడిపై టీడీపీ అనేక రకాల ఆరోపణలు చేసిందని తెలిపారు.

దేవుడి దయ వల్లే తాను, సీఎం జగన్ క్షేమంగా ఉన్నామని వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. దాడి తర్వాత జగన్ ఎలాంటి ఆరోపణలూ చేయలేదని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తామని తెలిపారు. దేవాల‌యాల విష‌యంలో రాజ‌కీయాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ ఐదేళ్లలో వైసీపీ ఏయే విజయాలు సాధించిందో వెలంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

రెండోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ వేసుకున్న ప్రణాళికలపై వెలంపల్లి స్పందించారు. ఏపీలో సంక్షేమం, సమ్మిళిత అభివృద్ధికి మీ ప్లాన్ ఆఫ్‌ యాక్షన్‌ ఏంటో వివిరంచి చెప్పారు. 175 సీట్స్‌ టార్గెట్‌ గా పెట్టుకున్న వైసీపీ అవలంబిస్తున్న వ్యూహాలపై ఆయన మాట్లాడారు. వైసీపీ మ్యానిఫెస్టో గురించి కూడా స్పందించారు.

Also Read: పిఠాపురంలో పవన్ పేరుతో ముగ్గురు బరిలో ఉన్నారు: జనసేన నేత శివశంకర్