10tv Conclave: పిఠాపురంలో పవన్ పేరుతో ముగ్గురు బరిలో ఉన్నారు: జనసేన నేత శివశంకర్
ప్రజలు పొత్తును ఆహ్వానిస్తున్నారని శివశంకర్ అన్నారు. ఏపీకి అనుభవం ఉన్న నాయకత్వం..

JanaSena Leader Shiva Shankar
పిఠాపురంలో పవన్ అనే పేరుతో ముగ్గురు బరిలో ఉన్నారని జనసేన నేత శివశంకర్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో శివశంకర్ మాట్లాడారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయాన్ని ఏ పార్టీ ఆపలేదని చెప్పారు. వ్యవస్థను తాము ఎప్పుడూ తప్పుపట్టలేదని తెలిపారు.
ప్రజలు పొత్తును ఆహ్వానిస్తున్నారని శివశంకర్ అన్నారు. ఏపీకి అనుభవం ఉన్న నాయకత్వం ఉండాలని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు. కూటమిలో జనసేన పాత్ర చాలా పరిమితమనే విమర్శలకు సమాధానాలు చెప్పారు.
జనసేనకు కేటాయించిన 21 సీట్లలోనూ కొన్ని టీడీపీ నుంచి వచ్చిన వారికి ఇవ్వడానికి కారణాల గురించి వివరించారు. చంద్రబాబే ఆ పార్టీ నాయకులను జనసేనలోకి పంపుతున్నారని వస్తున్న ఆరోపణలపై మాట్లాడారు. గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరంల్లో మళ్లీ ఎందుకు పోటీ చేయలేదో తెలిపారు.
Also Read: టీడీపీకి షాక్.. పార్టీకి యనమల కృష్ణుడు రాజీనామా