Dhanush Sir : నెక్లెస్ రోడ్ లో గ్రాండ్ గా.. నేడే ధనుష్ ‘సార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..

ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్. తమిళ్ లో వాతిగా తెరకెక్కుతున్న సినిమా తెలుగులో సార్ గా రానుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా...............

Dhanush Sir : నెక్లెస్ రోడ్ లో గ్రాండ్ గా.. నేడే ధనుష్ ‘సార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..

Dhanush Sir movie pre release event on february 15th at necklace road

Updated On : February 15, 2023 / 5:32 PM IST

Dhanush Sir :  ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శ్రీకర స్టూడియోస్ సహా నిర్మాణంలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్. తమిళ్ లో వాతిగా తెరకెక్కుతున్న సినిమా తెలుగులో సార్ గా రానుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ధనుష్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చదువుకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి ఈ సినిమాలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

చిత్రయూనిట్ ప్రస్తుతం అటు తమిళనాడులో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ లాంచ్, ఆడియో లాంచ్, ప్రెస్ మీట్ లు నిర్వహించగా తాజాగా సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ధనుష్ సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నేడు ఫిబ్రవరి 15 సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరవనున్నారు. అలాగే ఈ ఈవెంట్ కి ఎవరైనా స్టార్ హీరో చీఫ్ గెస్ట్ గా వచ్చే అవకాశం కూడా ఉందని సమాచారం.

ధనుష్ కి తెలుగులో మంచి మార్కెట్ తో పాటు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. ధనుష్ గత సినిమా తిరు కూడా తెలుగులో మంచి హిట్ అయింది. దీంతో ఇప్పటికే ధనుష్ తెలుగు ప్రమోషన్స్ లో కూడా చాలా యాక్టీవ్ గా పాల్గొంటున్నాడు. నేడు ధనుష్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తుండటంతో అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉంది.

Kartik Aryan : నా కుక్క ఇచ్చే అన్‌కండీషనల్ లవ్ ఏ అమ్మాయి ఇవ్వలేదు.. బాలీవుడ్ స్టార్ హీరో వాలెంటైన్స్ డే వ్యాఖ్యలు..

ఇక ఇప్పటికే సినిమా చూసిన చిత్రయూనిట్, సెన్సార్ మెంబర్స్ సినిమా చాలా బాగుంది అంటూ అభినందిస్తున్నారు. విద్యావిధానంలో ఉన్న దోపిడీపై ధనుష్ బ్రహ్మాస్త్రం వదిలాడని, ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న కమర్షియలిజాన్ని ఈ సినిమా కడిగిపడేసిందని, ప్రస్తుత విధ్యావిధానంలో ఉన్న దోపిడీకి బాధితులుగా ఉన్న కామన్ మ్యాన్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని, హీరోగా ధనుష్ ఫుల్ మార్క్స్ కొట్టేశాడని అంటున్నారు. వరుస విజయాలతో ఉన్న ధనుష్ ఈ సినిమాతో కూడా తెలుగు, తమిళ్ లో మరో హిట్ కొడతాడని అంతా భావిస్తున్నారు. ఇక అభిమానులు సార్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.