RadheShyam : ‘రాధేశ్యామ్’ 2022 లోనే రిలీజ్ అవుతుందని నాలుగేళ్ళ క్రితమే చెప్పారు

డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ప్రారంభించే ముందు కథ రాస్తున్న టైంలో దీనిపై బాగా రీసెర్చ్ చేశాను. ఈ రీసెర్చ్ లో భాగంగా తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న......

RadheShyam :  ‘రాధేశ్యామ్’ 2022 లోనే రిలీజ్ అవుతుందని నాలుగేళ్ళ క్రితమే చెప్పారు

Radheshyam

RadheShyam :  ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాధేశ్యామ్’. సాహో తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. రాధేశ్యామ్ ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.

ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఇక వరుసగా సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు చిత్ర బృందం. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టెక్నీకల్ టీం మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ సినిమా గురించి ఆసక్తికర విశేషాలని వెల్లడించాడు. డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ”ఈ సినిమా ప్రారంభించే ముందు కథ రాస్తున్న టైంలో దీనిపై బాగా రీసెర్చ్ చేశాను. ఈ రీసెర్చ్ లో భాగంగా తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెద్ద పెద్ద జ్యోతిష్యుల్ని కలిశాను. అయితే వాళ్లలో ఓ జ్యోతిష్కుడు ఈ సినిమా విడుదల గురించి ముందే చెప్పారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ చిత్రం 2022 ప్రథమార్థంలోనే విడుదలయ్యే అవకాశముందని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. నాలుగేళ్ల క్రితమే మొదలు పెట్టిన ఈ సినిమా ఇప్పుడు 2022 లో విడుదల అవుతుందని” తెలిపాడు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’కి వ్యాక్సిన్‌కి లింక్ పెట్టిన ఆర్జీవీ.. ప్రభుత్వం ఆర్జీవీ చెప్పింది చేయాలి అంటున్న నెటిజన్లు

ఇక ‘రాధేశ్యామ్’ సినిమాలో ప్రభాస్ కూడా చెయ్యి చూసి జాతకం చెప్పే హస్త సాముద్రిక నిపుణుడిగా కనపడబోతున్నాడు. ఇప్పుడు రాధాకృష్ణ ఈ విషయం చెప్పడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. సినిమా గురించి అభిమానులతో పాటు దేశం మొత్తం ఉన్న సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.