SC : నామినేషన్ వేయాలట..వారెంట్ ఉన్నా..అత్యాచారం కేసులో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయవద్దంటున్న సుప్రీంకోర్టు

వారెంట్ ఉన్నా..అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొనే ఓ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశించింది సుప్రీంకోర్టు.ఎందుకంటే అతను నామినేషన్ వేయాలట..ఎన్నికల ప్రచారం చేసుకోవాలట..

SC : నామినేషన్ వేయాలట..వారెంట్ ఉన్నా..అత్యాచారం కేసులో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయవద్దంటున్న సుప్రీంకోర్టు

Sc Police Not To Arrest Mla Simarjeet Singh Bains Till February 3

SC police not to arrest MLA Simarjeet Singh Bains till February 3 : గెలవడం ఒక్కటే రాజకీయ పార్టీల లక్ష్యం కారాదని నేర చరిత్ర ఉన్నవారికి పార్టీ టిక్కెట్లు ఎలా ఇస్తున్నారు? దానికి కారణమేంటీ? నేర చరిత్ర కలిగిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎందుకు కల్పించారో కూడా పేర్కొనాలని ఆయా పార్టీలకు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థికి టికెట్ ఇచ్చిన 48 గంటలల్లోగానే ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని… వార్తాపత్రికల్లో కూడా ప్రచురించాలని ఆదేశించింది. కానీ తాజాగా సుప్రీంకోర్టు ఓ అత్యాచారం కేసులో అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిన ఓ ఎమ్మెల్యే అభ్యర్థిని అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు పోలీసులకు ఆదేశించటం చర్చనీయాంశంగా మారింది.

అత్యాచారం కేసులో అరెస్ట్‌ వారెంట్‌ను ఎదుర్కొంటున్న లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీ ఎమ్మెల్యే సిమర్‌జీత్‌ సింగ్‌ బైన్స్‌ను ఫిబ్రవరి 3 వరకు అరెస్ట్‌ చేయవద్దని పంజాబ్‌ పోలీసులను సుప్రీంకోర్టు మంగళవారం (జనవరి 1,2022) ఆదేశించింది. ఈ కేసు విచారణలో సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్‌ పత్రాల దాఖలు, ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 23 వరకు ఎమ్మెల్యే సిమర్‌జిత్‌ బయట ఉండేందుకు సర్వోన్నత న్యాయస్థానం మొదట్లో అనుమతించింది.

Also read : Criminal Records: 48గంటల్లో రాజకీయాల్లో నేరస్తుల వివరాలు చెప్పాల్సిందే.. సుప్రీం ఆదేశాలు!

కానీ ధర్మాసనం ఇచ్చిన ఈ అనుమతిపై అత్యాచార బాధితురాలి తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. దీంతో సుప్రీంకోర్టు ఫిబ్రవరి 3 వరకు లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీ ఎమ్మెల్యే సిమర్‌జీత్‌ సింగ్‌ బైన్స్‌ను అరెస్టు చేయవద్దని తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లిల ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.

నేర చరిత్ర ఉన్న నాయకులపై ధర్మాసనం ఉక్కుపాదం.. రాజకీయ పార్టీలకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

కాగా..ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయనేది దేశంలోని ప్రజలందరికీ ఉన్న ఒక బలమైన అభిప్రాయం ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. నేర చరిత్ర ఉన్నవారు రాజకీయాల్లో ఎక్కువమంది ఉన్నారనే అభిప్రాయముంది. గత కొన్నేళ్లుగా దాదాపు అన్ని పార్టీల నుంచి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటం పెరిగుతోందనే చెప్పాలి. ఎన్నికల అఫిడవిట్లలో ఎంతో మంది నేతలు తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడిస్తుండటం దానికి నిదర్శనమి చెప్పాలి. ఓటర్లకు కూడా మరోదారి లేక వీరిలోనే ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సిన దుస్థితి దాపురించింది. కానీ నోటా అందుబాటులోకివ వచ్చాక వారిని వ్యతిరేకించే అకాశం ఉంది. కానీ ఎంతమంది ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు అంటే అదో పెద్ద ప్రశ్న అనే చెప్పొచ్చు. బహుశా దీనికి పెద్దగా అవగాహన లేకపోవటం కూడా కావచ్చు.

ఇటువంటి పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.ప్రతి రాజకీయ పార్టీ వారి అధికారక వెబ్ సైట్లతో పాటు, సోషల్ మీడియాలో నేర చరిత్ర కలిగిన నాయకుల పూర్తి వివరాలను అప్ లోడ్ చేయాలని గతంలో ఆదేశించింది. అంతేకాదు, నేర చరిత్ర కలిగిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎందుకు కల్పించారో కూడా పేర్కొనాలని ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థికి టికెట్ ఇచ్చిన 48 గంటలల్లోగానే ఈ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని… వార్తాపత్రికల్లో కూడా ప్రచురించాలని ఆదేశించింది. 72 గంటల్లోపల అభ్యర్థి క్రిమినల్ కేసుల వివరాలను ఈసీకి అందించాలని చెప్పింది.

ఎన్నికలలో ఏ వ్యక్తినైనా ఎన్నుకోవడం అనే ప్రక్రియ కేవలం ఆ వ్యక్తి గొప్ప లక్షణాల ఆధారంగానే జరగాలని… పలానా వ్యక్తి అయితేనే గెలుస్తాడు అనే ధోరణితో జరగరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నేర చరిత్ర ఓటర్లకు తెలవాలని… వారికి ఓటు వేయాలో, వద్దో ఓటర్లే నిర్ణయించుకుంటారని చెప్పింది. గెలవడం ఒక్కటే రాజకీయ పార్టీల లక్ష్యం కారాదని సూచించింది.అటువంటి సుప్రీంకోర్టే అరెస్ట్ వారెంట్ ఉన్నా ఓ ఎమ్మెల్యే అభ్యర్థిని అరెస్ట్ చేయవద్దని చెప్పటం విశేషం.