Rakul: ఈడీ విచారణలో 6గంటల పాటు రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో రకుల్ ప్రీత్‌సింగ్‌ను ఈడీ అధికారులు విచారించారు. 6 గంటలకు పైగా రకుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది....

Rakul: ఈడీ విచారణలో 6గంటల పాటు రకుల్ ప్రీత్ సింగ్

Tollywood Drugs

Rakul: టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో రకుల్ ప్రీత్‌సింగ్‌ను ఈడీ అధికారులు విచారించారు. 6 గంటలకు పైగా రకుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎక్సైజ్‌శాఖ కేసులో రకుల్‌ పేరు లేకున్నప్పటికీ.. క్లబ్‌ పార్టీ ఫుటేజ్ ఆధారంగా రకుల్‌ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మనీలాండరింగ్‌, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నలు సంధించారు.. ఎక్సైజ్‌శాఖ కేసులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు లేనప్పటికీ ఎఫ్‌ క్లబ్‌ ఆర్థిక లావాదేవీల్లో రకుల్‌ పేరు ఉండటం, పార్టీకి హాజరుకావడంతో ఈడీ ఆమెకు నోటీసులు అందచేసింది.

రకుల్‌కు చెందిన హైదరాబాద్‌, ఢిల్లీ, బాంబేలో రకుల్‌కు ఉన్న బ్యాంక్‌ అకౌంట్ల వివరాలను రాబట్టింది. పెద్ద మొత్తంలో ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌కు, కెల్విన్‌కు డబ్బులు పంపినట్టు విచారణలో గుర్తించింది ఈడీ. కొన్ని అనుమానిత లావాదేవీలపై ఆడిటర్‌తో పాటు రకుల్‌ను విచారించింది ఈడీ. కెల్విన్‌, ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌లతో రకుల్‌ చేసిన చాటింగ్‌ వివరాలను సేకరించింది ఈడీ. అంతేగాక రకుల్‌ పార్టనర్‌గా ఉన్నా ఫిట్‌‌నెస్‌ సెంటర్ల వివరాలపై కూడా ఆరా తీసింది ఈడీ.

రకుల్‌.. రియా చక్రవర్తితో వాట్సాప్‌ చాట్‌:
బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ ఎదుర్కోన్న రకుల్‌.. రియా చక్రవర్తితో వాట్సాప్‌ చాట్‌, బ్యాంక్‌ ట్రాన్సాక్షన్స్‌పై ఆరా తీసింది. మొన్న పూరీ, నిన్న ఛార్మి, నేడు రకుల్‌.. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణలో దూకుడు మీదున్న ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ వీరందరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.. నిజానికి కెల్విన్‌ అరెస్ట్‌తో ఈ డ్రగ్‌ కేసు డొంక కదలింది.. కెల్విన్ బ్యాంక్ అకౌంట్లను పరిశీలించి, పరీక్షించి.. ఏదో మతలబు ఉందని డిసైడ్ అయ్యాక అతని అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేసింది ఈడీ. విచారణకు 12 సార్లు హాజరైన కెల్విన్‌.. ఇక తప్పదని అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తోంది.

Rakul Rhea Chakravathy

Rakul Rhea Chakravathy

దీంతో అతనితో ఎవరెవరు లావాదేవీలు జరిపారు? ఎవరేవరు డ్రగ్స్‌ కొనుగోలు చేశారు? అన్న డొంకను కదలించేందుకు ఒక్కోక్కరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈడీ అధికారులు.

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌

Puri Jagannath

Puri Jagannath

ముందుగా డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ను విచారించింది ఈడీ.. దాదాపు 10 గంటల పాటు కొనసాగింది విచారణ. విచారణలో పూరీకి పలువురు ఆఫ్రికన్ల ఫోటోలు చూపించి వీరేవరో తెలుసా అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.. అయితే వారేవరో తనకు తెలియదని పూరీ చెప్పినట్టుగా సమాచారం. అయితే పూరీ అకౌంట్‌ నుంచి ఆఫ్రికాకు ట్రాన్సక్షన్స్‌ ఎందుకు వెళ్లాయో వివరించాలని పూరీని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.. అయితే తన సినిమా విషయంలో ఈ ట్రాన్సక్షన్స్‌ జరిపినట్టు పూరీ జగన్నాథ్‌ ఈడీ అధికారులకు వివరించారని తెలుస్తోంది.

సినీ నటి ఛార్మీ

Charmi Kaur

Charmi Kaur

ఇక తరువాతి రోజు సినీ నటి ఛార్మీని 8 గంటలకు పైగా విచారించింది ఈడీ.. డ్రగ్స్‌, మనీలాండరింగ్‌, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఇక కెల్విన్‌తో చాటింగ్‌, దాదా పేరుతో జరిగిన లావాదేవీలపై కూడా ఆరా తీసినట్టు సమాచాం.. చార్మి రెండు బ్యాంక్‌ అకౌంట్ల లావాదేవీలపై కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.. అయితే తాను ఈడీ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు.. తనను కొన్ని డాక్యుమెంట్స్‌ సమర్పించాలని ఈడీ కోరిందని ఛార్మి తెలిపారు..

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను 6 గంటలకు పైగా

Rakul Preeth Singh

Rakul Preeth Singh

ఇక మూడో రోజు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను 6 గంటలకు పైగా విచారించింది. ఎక్సైజ్‌శాఖ కేసులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు లేనప్పటికీ ఎఫ్‌ క్లబ్‌ ఆర్థిక లావాదేవీల్లో రకుల్‌ పేరు ఉండటం, పార్టీకి హాజరుకావడంతో ఈడీ ఆమెకు నోటీసులు అందచేసింది.. రకుల్‌కు చెందిన హైదరాబాద్‌, ఢిల్లీ, బాంబేలో రకుల్‌కు ఉన్న బ్యాంక్‌ అకౌంట్ల వివరాలను రాబట్టింది. పెద్ద మొత్తంలో ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌కు, కెల్విన్‌కు డబ్బులు పంపినట్టు విచారణలో గుర్తించింది ఈడీ.

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ

Ed Enquiry

Ed Enquiry

కొన్ని అనుమానిత లావాదేవీలపై ఆడిటర్‌తో పాటు రకుల్‌ను విచారించింది ఈడీ. కెల్విన్‌, ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌లతో రకుల్‌ చేసిన చాటింగ్‌ వివరాలను సేకరించింది ఈడీ. అంతేగాక రకుల్‌ పార్టనర్‌గా ఉన్నా ఫిట్‌ నెస్‌ సెంటర్ల వివరాలపై కూడా ఆరా తీసింది ఈడీ. బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ ఎదుర్కోన్న రకుల్‌.. రియా చక్రవర్తితో వాట్సాప్‌ చాట్‌, బ్యాంక్‌ ట్రాన్సాక్షన్స్‌పై ఆరా తీసింది..