Tollywood Drugs Case : ఈడీ విచారణకు రానా హాజరు..ఆ విషయాలే కీలకం

ఈడీ విచారణకు నటుడు ‘రానా’ హాజరయ్యారు. తన వ్యక్తిగత సిబ్బందితో ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు.

Tollywood Drugs Case : ఈడీ విచారణకు రానా హాజరు..ఆ విషయాలే కీలకం

Rana

Updated On : September 8, 2021 / 10:56 AM IST

Rana Daggubati : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఇందులో పలువురు సినీ నటులకు, నటీమణులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈడీ విచారణకు హాజరవుతున్నారు. తాజాగా…2021, సెప్టెంబర్ 08వ తేదీ బుధవారం ఈడీ విచారణకు నటుడు ‘రానా’ హాజరయ్యారు.

Read More : Tollywood Drug Case : ఈడీ ముందుకు రానా..ప్రశ్నించనున్న అధికారులు

తన వ్యక్తిగత సిబ్బందితో ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. అనంతరం ఆయన లోనికి వెళ్లారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారని సమాచారం. కెల్విన్ తో ఎలాంటి పరిచయాలున్నాయి ? ఎఫ్ క్లబ్ గురించ ఏమైనా తెలుసా ? ఇతర అనేక విషయాలపై రానాను ప్రశ్నించనున్నారని తెలుస్తోంది.

Read More : Akshay Kumar : అక్షయ్ కుమార్ తల్లి కన్నుమూత

ఎక్సైజ్ సిట్ దర్యాప్తులో రానా, రకుల్ ప్రీత్‌సింగ్‌ పేర్లు తెరపైకి రాలేదు. కానీ ఈడీ దర్యాప్తులో ఇద్దరి పేర్లు తెరపైకి రావడంతో విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో ఇప్పటికే రకుల్ ప్రీత్‌ సింగ్ ఈడీ విచారణకు హాజరయ్యారు.