Ek Mini Katha : సైజ్ సమస్యే కాదు బ్రో.. ‘ఏక్ మినీ క‌థ’ ఏంటనేది ఏప్రిల్ 30న తెలుస్తుంది..

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు (వర్షం, బాబి, చంటి) శోభ‌న్ కుమారుడిగా ‘గోల్కొండ హైస్కూల్’ తో తెలుగు తెర‌కి ప‌రిచ‌యమై ‘పేప‌ర్ బాయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల చేత న‌టుడిగా మంచి మార్కులు వేయించుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఏక్ మినీ క‌థ’..

Ek Mini Katha : సైజ్ సమస్యే కాదు బ్రో.. ‘ఏక్ మినీ క‌థ’ ఏంటనేది ఏప్రిల్ 30న తెలుస్తుంది..

Ek Mini Katha

Ek Mini Katha: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు (వర్షం, బాబి, చంటి) శోభ‌న్ కుమారుడిగా ‘గోల్కొండ హైస్కూల్’ తో తెలుగు తెర‌కి ప‌రిచ‌యమై ‘పేప‌ర్ బాయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల చేత న‌టుడిగా మంచి మార్కులు వేయించుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఏక్ మినీ క‌థ’..

Ek Mini Katha

యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌కి అనుభంద సంస్థగా యువి కాన్సెప్ట్స్ బ్యాన‌ర్‌ని స్థాపించి కార్తీక్ రాపోలు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు.. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రంతో యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో స‌క్స‌ెస్ సాధించిన ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రానికి క‌థ‌ అందించారు. ‘వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘కృష్ణార్జున యుద్ధం’ లాంటి చిత్రాల‌తో టాలీవుడ్‌లో దూసుకుపోతున్న మేర్ల‌పాక గాంధీ ఇప్పుడు ఈ ‘ఏక్ మినీ క‌థ’కి క‌థ‌, ర‌చ‌న ఇవ్వ‌ట‌మే కాకుండా ద‌ర్శ‌కుడు కార్తీక్ రాపోలుకి త‌న స‌పోర్ట్‌ని అందించడం విశేషం.

Ek Mini Katha

ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి రెస్పాన్స్ అదిరిపోయింది.‘అది చిన్న‌దైతే మాత్రం ప్రాబ్లం పెద్ద‌దే బ్రో’ అనే డైలాగ్‌తో కాన్సెప్ట్ ఏంటనేది హింట్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘ఏక్ మినీ క‌థ’ మూవీని ఏప్రిల్ 30న ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.

ఈ చిత్రానికి కథ, మాట‌లు: మేర్లపాక గాంధీ
దర్శకుడు: కార్తీక్ రాపోలు
నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
స్క్రీన్‌ప్లే .. మేర్ల‌పాక గాంధి, షేక్ దావూద్‌.
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌.. తోట విజ‌య భాస్క‌ర్‌
లిరిక్స్‌.. భాస్క‌ర‌భ‌ట్ల‌, శ్రీజో.
డాన్స్‌.. య‌స్ మాస్ట‌ర్‌
ఫైట్స్‌.. స్టంట్ జాషువా
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
ఎడిటర్: సత్య. జి
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. ఎన్ . సందీప్‌
లైన్ ప్రోడ్యూస‌ర్‌.. ఎస్‌.పి. నాగర్జున వ‌ర్మ (ప్ర‌వీణ్‌)
కొ-డైర‌క్ట‌ర్‌.. బైరెడ్డి నాగిరెడ్డి
ప‌బ్ల‌సిటి డిజైన‌ర్‌.. క‌బిల‌న్ చెల్లై
క్రియేటివ్ టీం.. అనిల్ కుమార్ ఉపాద్యాయిల.