YouTube : యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నారా..! ఈ షార్ట్‌కట్స్ తెలుసుకోండి

కీబోర్డ్‌పై ఓ బటన్ ను టక్ మని నొక్కినప్పుడు పని జరిగిపోతే సౌకర్యంగా అనిపిస్తుంది. అలాంటి అమేజింగ్ ట్రిక్స్ తెల్సుకుందాం.

YouTube : యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నారా..! ఈ షార్ట్‌కట్స్ తెలుసుకోండి

Youtube

YouTube : యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ గంటలే కాదు.. రోజులు గడిపేస్తున్న టైం ఇది. డెస్క్ టాప్‌పై యూట్యూబ్ వీడియోలు చూస్తుండేవాళ్లు  కోట్లమంది ఉంటారు. వారికోసం.. ఎంతో పనికొచ్చే 18 చిట్కాలు ఉన్నాయి. ప్రతిసారి మౌజ్ ను యూజ్ చేయడం చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కీబోర్డ్‌పై ఓ బటన్ ను టక్ మని నొక్కినప్పుడు పని జరిగిపోతే సౌకర్యంగా అనిపిస్తుంది. అలాంటి అమేజింగ్ ట్రిక్స్ తెల్సుకుందాం.

  1. స్పేస్ బార్ నొక్కితే యూట్యూబ్ వీడియో పాజ్ అవుతుందనేది చాలామందికి తెలిసిందే. ఐతే.. కొన్ని సార్లు ఇది వర్కవుట్ కాదు. అందుకే.. కీ బోర్డ్ పై  K కీని నొక్కితే..వీడియో Pause/Play అవుతుంది.
  2. యూట్యూబ్ వీడియోను ఫుల్ స్క్రీన్ లో చూడాలనుకుంటే F ప్రెస్ చేయండి
  3. వీడియోను థియేటర్ మోడ్‌లో చూడాలనుకుంటే T ప్రెస్ చేయండి
  4. వీడియోను Mini Player లో చూడాలనుకుంటే i నొక్కండి.(మినీ ప్లేయర్‌లో చూస్తే యూట్యూబ్‌ను బ్రౌజ్ చేసుకునే వీలుంటుంది)
  5. వీడియోలో వచ్చే ఆడియోను Mute/Unmute చేయాలంటే M నొక్కండి
  6. వీడియోలో వచ్చే ఆడియో సౌండ్ పెంచాలన్నా తగ్గించాలన్నా Up Arrow/Down Arrow ప్రెస్ చేయండి. 
  7. 5 సెకన్ల పాటు వీడియోను ఫార్వర్డ్ గానీ.. బ్యాక్ వర్డ్ గానీ జరపాలంటే… Left Arrow/ Right Arrow నొక్కండి
  8.  10 సెనక్ల పాటు వీడియోను ఫార్వర్డ్ చేయాలంటే J నొక్కండి
  9. 10 సెకన్ల పాటు వీడియోను బ్యాక్ వర్డ్ చేయాలంటే L నొక్కండి
  10. వీడియో Pause(ఆగిన పొజిన్) చేసినప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ ను చూడాలంటే.. కామా(,) నొక్కండి
  11. వీడియో Pause(ఆగిన పొజిషన్) చేసినప్పుడు ఇంతకుముందు ఫ్రేమ్ చూడాలంటే… ఫుల్ స్టాప్ (.) నొక్కండి
  12. వీడియోను స్పీడ్(Fast Forward) గా లేదా స్లోగా చూడాలనుకున్నప్పుడు < లేదా > కీ లు వాడండి
  13. వీడియోను మొదటి లేదా చివరి సెకన్లలో చూడాలనుకున్నప్పుడు.. Home లేదా End కీ లు వాడండి.(కర్సర్ సీక్ బార్ పై ఉండాలి)
  14. వీడియోలోని ఓ పార్ట్ కైనా వెళ్లాలనుకున్నప్పుడు.. కీ బోర్డ్ నంబర్స్ 0-9 వరకు ఏ నంబర్‌నైనా నొక్కండి. (Example: 0(సున్నా) స్టార్టింగ్ పాయింట్‌ను .. 5 అనేది 50%… 9 అనేది ఎండ్ పాయింట్ ను ఇండికేట్ చేస్తుంది.)
  15. యూట్యూబ్ విండోలో నేరుగా సెర్చ్(Search Box)కు వెళ్లాలంటే Forward Slash  / నొక్కండి.
  16. వీడియో క్యాప్షన్స్ ఆన్, ఆఫ్ చేసుకోవాలంటే C ప్రెస్ చేయండి
  17. ప్లే లిస్ట్‌లో ప్రీవియస్ వీడియో చూడాలనుకుంటే Shift P నొక్కండి
  18. ప్లే లిస్ట్‌లో నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే Shift N నొక్కండి