BIS..FFP2 S Mask : బీఐఎస్ ఆమోదించిన మాస్క్..‘FFP2 S.. N95 కంటే మెరుగైన రక్షణ

బీఐఎస్ ఆమోదించిన మాస్క్..‘FFP2 S..ఈ మాస్కు N95 కంటే మెరుగైన రక్షణనిస్తుంది.

BIS..FFP2 S Mask : బీఐఎస్ ఆమోదించిన మాస్క్..‘FFP2 S.. N95 కంటే మెరుగైన రక్షణ

Bis..ffp2 S Mask

Council of Indian Standards BIS..FFP2 S Mask : మాస్క్. కరోనా వచ్చాక ప్రతీ ఒక్కరి ముఖాన్ని కప్పేసే మాస్కుల్లో ఎన్నో రకాల మాస్కులను చూశాం.చిత్ర విచిత్రమైన మాస్కులు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. గుడ్డ మాస్కులు, సర్జికల్ మాస్కులు, ఎన్95 మాస్కులు, పర్యావరణ హిత మాస్కులు. ఇలా ఒకటేమిటి? ఎన్నో మాస్కులు చూశాం.

2020 ఆరంభంలో కరోనా ప్రవేశించిన తర్వాత నుంచి మాస్క్ లలో ఎన్నో రకాలు చూశాం. ఎక్కువ మందికి తెలిసింది మాత్రం గుడ్డ మాస్క్. ఎక్కువ మంది ధరిస్తున్నది ఇదే. తర్వాత వాడి పడేసే సర్జికల్ మాస్క్, ఎన్95 మాస్క్. వీటికి అదనంగా భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్)(Council of Indian Standards)ఆమోదించిన మాస్క్ కూడా ఒకటి ఉంది. అదే ఎఫ్ఎఫ్పీ2 ఎస్ మాస్క్ (FFP2 S Mask) ఇది ఎన్95 కంటే మెరుగైన రక్షణనిస్తుంది.

వైస్, బ్యాక్టీరియా, కాలుష్యం, దుమ్ము, ధూళి కణాలు, పుప్పొడి రేణువులు, 0.3 మైక్రాన్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న వాటిని ఎఫ్ఎఫ్ఫీ 2 ఎస్ మాస్క్ అడ్డుకుంటుంది. ఎలక్ట్రోస్టాటికల్లీ చార్జ్ డ్ మెల్ట్ బ్లౌన్ ఫిల్టర్లు మాస్క్ లో ఉంటాయి.ఇన్ఫెక్షన్, కాలుష్య కారకాలను ఈ బ్లైన్ ఫిల్టర్లు పట్టేస్తాయి. లోపలికి చొరబడకుండా నిలువరిస్తాయి.

ఎఫ్ఎఫ్పీ2 ఎస్ మాస్క్ ముఖం మొత్తాన్ని కప్పే విధంగా ఉంటుంది. గడ్డం దగ్గర నుంచి ముక్కు పై భాగం వరకు పూర్తిగా కవర్ అవుతుంది. దీంతో మరింత రక్షణ ఉంటుంది. బట్టతో తయారు చేసిన మాస్క్ రక్షణ విషయంలో పెద్దగా ఫలితం ఉండదని పలువురు నిపుణులు తెలిపారు. అలాగే కోవిడ్ కంటే ముందు నుంచి కాలుష్య నివరణ కోసం ధరించే ఎన్95 మాస్క్ ధరిస్తే వైరస్ సోకిన వ్యక్తి సమక్షంలో ఉన్నప్పటికీ 25 గంటల పాటు మనకు రక్షణనిస్తుందని ఒక అధ్యయనం తెలిపింది.

అదే గుడ్డ మాస్క్ తో అయితే..కేవలం 27 నిమిషాలు కూడా రక్షణ ఉండదటని నిపుణులు తెలిపారు. కాగా..ఐటీసీ శావ్లాన్ బ్రాండ్ కింద FFP 2 S మాస్కులనే విక్రయిస్తోంది. సో..కోవిడ్ మహమ్మారి పూర్తిగా సమసిపోలేదని..అది ఎప్పటికి మనతోనే ఉంటుందని నిపుణుల సూచనల మేరకు ఈ FFP 2 S మాస్కులతో భధ్రత ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.