విశాల్ ‘ఎనిమి’ వచ్చేశాడు..

విశాల్ ‘ఎనిమి’ వచ్చేశాడు..

Enemy: విశాల్, ఆర్య కలయికలో ‘నోటా’ ఫేం ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఎనిమి’.. మిర్నాలిని రవి కథానాయికగా నటిస్తోంది.. ఇటీవల ‘ఎనిమి’ మూవీలో విశాల్ లుక్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

గురువారం ఆర్య ఫస్ట్ లుక్ విశాల్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌తో ‘ఎనిమి’ సినిమాలో ‘ఎనిమి’ ఎవరనేది రివీల్ అయిపోయింది. చేతికి సంకెళ్లతో, ఒంటిపై గాయాలతో కోపంగా చూస్తున్న ఆర్య లుక్ ఆకట్టుకుంటోంది.

https://10tv.in/vishal-enemy-movie-first-look/

ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కెమెరా : ఆర్.డి.రాజశేఖర్, ఫైట్స్ : రవివర్మ, ఆర్ట్ : రామలింగం, సమర్పణ : మిని స్టూడియోస్, నిర్మాత : వినోద్ కుమార్.