FOCUS Movie : సూర్య తేజ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న డిఫరెంట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఫోకస్‌’

విజయ్‌ శంకర్‌, అషూ రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీకి ‘ఫోకస్‌’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేశారు..

FOCUS Movie : సూర్య తేజ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న డిఫరెంట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఫోకస్‌’

Focus Telugu Movie

Updated On : December 27, 2021 / 11:16 AM IST

FOCUS Movie: విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతున్న విజయ్‌ శంకర్‌ మరో విలక్షణమైన కథతో మ‌న ముందుకు రానున్నారు. స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో నిర్మాణ విలువల విషయంలో ఏ మాత్రం రాజీపడని రిలాక్స్‌ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఫోకస్‌’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఉత్కంఠ‌భ‌రిత‌మైన స్క్రీన్‌‌ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా జి. సూర్య తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

Vijay Deverakonda : తెలంగాణ సర్కార్ ఇండస్ట్రీ బాగును కోరుకుంటోంది..

మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘ఫోకస్‌’ మూవీ తెరకెక్కుతోంది. ప్ర‌ముఖ న‌టి సుహాసిని మ‌ణిర‌త్నం కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అషూ రెడ్డి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Focus Movie

విజయ్‌ శంకర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుండగా సుహాసిని మణిరత్నం జడ్జ్‌ పాత్రలో నటిస్తున్నారు. భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, సూర్య భగవాన్‌ ఇతర ముఖ్య‌ పాత్రల్లో కనిపిస్తారు.

Thaman S : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ కు థమన్ రీ రికార్డింగ్!

‘‘ఫోకస్‌’ అని టైటిల్ పెట్ట‌డంతోనే మా సినిమాపై ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్‌ ఫోకస్‌ కూడా పడింది. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి.. కానీ మా ‘ఫోకస్‌’ చిత్రం వాటంన్నింటికి విభిన్నంగా ఉంటుంది. మర్డర్‌ మిస్టరీ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు మా చిత్రం కొత్త తరహా అనుభూతినిస్తుంది. సినిమాను గురించిన మరిన్ని విశేషాలు, వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర ద‌ర్శ‌కుడు సూర్య‌ తేజ తెలిపారు.

Focus Telugu Movie