Dinkar Gupta: ఎన్ఐఏ డీజీగా దినకర్ గుప్తా

గుప్తా నియామకానికి సంబంధించి కేంద్ర హోం వ్యవహారాల శాఖ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. దినకర్ గుప్తా.. మార్చి 31, 2024 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

Dinkar Gupta: ఎన్ఐఏ డీజీగా దినకర్ గుప్తా

Dinkar Gupta

Dinkar Gupta: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ దినకర్ గుప్తా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా ఎంపికయ్యారు. ఎన్ఐఏకు సంబంధించి ఇదే అత్యున్నత పదవి. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ కార్యకలాపాలన్నీ దినకర్ గుప్తా ఆధ్వర్యంలోనే జరుగుతాయి. గుప్తా నియామకానికి సంబంధించి కేంద్ర హోం వ్యవహారాల శాఖ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. దినకర్ గుప్తా.. మార్చి 31, 2024 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. అదే రోజు పదవీ విరమణ చేస్తారు. ఆయన 1987 బ్యాచ్‌కు చెందిన పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి.

Spotify: స్పోటిఫైలో కమ్యూనిటీ ఫీచర్

గతేడాది ఆయన పంజాబ్ డీజీపీగా కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. తర్వాత పంజాబ్ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా బదిలీ చేసింది. కేంద్ర ప్రభుత్వం గురువారం మరో నియామకం కూడా చేపట్టింది. స్వాగత్ దాస్ అనే మరో ఐపీఎస్ అధికారిని అంతర్గత భద్రతకు సంబంధించి స్పెషల్ సెక్రటరీగా నియమించింది. స్వాగత్ దాస్ 1987 బ్యాచ్‌కు చెందిన చత్తీస్‌ఘడ్‌ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఈయన నవంబర్ 30, 2024 వరకు పదవిలో కొనసాగుతారు. అదే రోజు పదవీ విరమణ చేస్తారు.